కరోనా వైరస్ కారణంగా మాస్కులు, హ్యాండ్ శానిటైజర్స్ డిమాండ్ బాగా పెరిగాయి. గత కొంత కాలంగా ఇవి మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితిలో ఇవి లేకుండా అడుగు బయటికి పెట్టే సమస్యే లేదు. సాధారణంగా మార్కెట్‌లో`లభించే హ్యాండ్ శానిటైజర్స్ అన్ని ఆల్కహాల్ బేస్డ్ అన్న విషయం మనం తెలుసుకోవాలి. శానిటైజర్స్ లో దాదాపుగా 60 నుంచి 95 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది. ఇది క్రిములను చంపడానికి చాలా ముఖ్యమైన కాంపోనెంట్. అందుకే ఇది క్రిమి నాశినిగా పనిచేస్తుంది. కానీ ఇది పెట్స్ విషయంలో అసలు మంచిది కాదు అని చెప్తున్నారు నిపుణులు. మనుషులు వాడే శానిటైజర్స్ పెట్స్ కు హాని కలిగిస్తాయి. ఈ శానిటైజర్స్ వాడటం వల్ల పెట్స్ ప్రాణాలకే ప్రమాదం. శానిటైజర్స్ వల్ల ఎలర్జీ రావొచ్చు ఇంకా వాంతులు అలాగే సీజర్స్ వంటి లక్షణాలను కూడా చూపిస్తాయి.
కాబ్బట్టి ఇండియన్ మార్కెట్స్ లో పెట్స్ కోసమే వేరే శానిటైజర్స్ ను తయారు చేస్తున్నారు. ఈ పెట్ శానిటైజర్స్ లో యాంటీసెప్టిక్ లక్షణాలు ఉండటం వల్ల వాటికీ హాని కలగదు అంటున్నారు నిపుణులు. ఈ పెట్ శానిటైజర్స్ లో ఎసెన్షియల్ ఆయిల్స్ ను కలపడం వల్ల ఈ పదార్థాలనేవి పెట్స్ కి సేఫ్ కూడా ఈ పెట్ శానిటైజర్స్ అనేవి ఇన్స్టెంట్ క్లీన్సర్స్ లా కూడా పనిచేస్తాయి. పెట్స్ ను బాక్టీరియా ఇంకా జెర్మ్స్ నుంచి రక్షిస్తాయి. ఈ శానిటైజర్స్ లిక్విడ్ ఫార్మ్ లో లభిస్తాయి. మనం వాడే నార్మల్ శానిటైజర్ లాగానే పనిచేస్తూ పెట్స్ మీద దుష్ప్రఫలితాలు చూపకుండా సేఫ్ గా ఉంచుతాయి. వీటిని ఉపయోగించడం కూడా సులువే. కాబ్బటి పెట్స్ ను గి ఉన్నవారందరు వీటిని ఉపయోగించడం మంచిది అని సూచిస్తున్నారు నిపుణులు.
పెట్ శానిటైజర్స్ లో చిన్న మోతాదులో బెంజాల్కొనియం క్లోరైడ్ ఉండటం వల్ల ఇది పెట్స్ పై జెర్మ్ కిల్లర్ గా పనిచేస్తుంది. క్రిములను హతమార్చి, వైరస్ ను అంతం అందిస్తుంది. ఈ శానిటైజర్ పెట్స్ మీద నాన్ టాక్సిక్ గా పనిచేస్తాయి. కాబట్టి ఇవి పెట్స్ మీద చాలా సురక్షితం అంటున్నారు నిపుణులు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…