Political News

YS Jagan : జగన్ పర్యటనలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పల్నాడు జిల్లాలో తీవ్ర విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు సంఘటనల్లో రెండు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది.

Tragedy during Jagan’s tour.. Two people died in separate incidents

వివరాల్లోకి వెళ్తే, ఈరోజు ఉదయం ఏటుకూరు బైపాస్ వద్ద జగన్ కాన్వాయ్‌లోని వాహనాలలో ఒకటి సింగయ్య అనే వృద్ధుడిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలుతో ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు.

అలాగే మరో ఘటనలో, సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద జగన్ రాక సందర్భంగా ఏర్పడిన జనసందోహంలో వైసీపీ కార్యకర్త జయవర్ధన్ రెడ్డి (ఓ ఆటోమొబైల్ షాప్ నిర్వాహకుడు) తీవ్ర తోపులాటలో ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఈ రెండు ఘటనలతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్న నేపథ్యంలో సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్ లో తడబాటు ఉండటం వంటి అంశాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

telugudesk

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

17 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

18 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago