AP Election Result: ఏపీ ఎన్నికల ఫలితాలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది దీంతో ఏపీ ప్రజలందరూ కూడా ఎంతో ఆత్రుతగా ఈ ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు అయితే ఇప్పటికీ ఎన్నో ఎగ్జిట్ పోల్స్ ఏపీ ఎన్నికల ఫలితాల గురించి సర్వేలు చేసి ఫలితాలను వెల్లడించారు. కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా రాగ మరికొన్ని సర్వేలు టిడిపికి అనుకూలంగా వచ్చాయి.
ఇలా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ అయోమయంలో ఉన్నారు. ఏది నిజమవుతుంది ఏది లేదు అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ ఉంది ఇలాంటి తరుణంలోనే సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ఎన్నికల ఫలితాలపై ఒక సర్వే ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఎన్నికల ఫలితాలపై ఆర్జీవీ చేసిన ఓ ఎగ్జిట్ పోల్ ట్విట్టర్‌లో షేర్ చేయగా అది కాస్తా.. సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఎవరు కూడా ఊహించని విధంగా ఈ ఫలితాలు ఉండటం గమనార్హం. ఎన్నికల ఫలితాలలో భాగంగా వైఎస్ఆర్సిపి పార్టీకి 0నుంచి175 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అలాగే ఎంపీ సీట్లు 0నుంచి 25 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.
సంచలనంగా వర్మ సర్వే..
అలాగే కూటమి కూడా 0నుంచి 175 స్థానాలు ఎంపీ సీట్లు కూడా 0 నుంచి 25 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చూసిన నెటిజన్లు.. వీడినీ ఎవరికైనా చూపించండ్రా అలా వదిలేయకండ్రా అంటూ వర్మ షేర్ చేస్తున్న ఈ వీడియో పై వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…