Political News

ట్రంప్-మోదీ ఫోన్ కాల్.. శాంతి దిశగా భారత్ కీలక సందేశం

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ కీలక దౌత్యపరమైన సందేశం ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిగిన ఫోన్ సంభాషణ వివరాలను ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.

సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని, పశ్చిమాసియా పరిస్థితులపై తమ మధ్య నిర్మాణాత్మక చర్చ జరిగిందని తెలిపారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించి, శాంతి స్థాపనకు తీసుకునే ప్రతి చర్యకు భారత్ మద్దతు ఇస్తుందని ట్రంప్‌కు తెలియజేశానని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హర్మూజ్ జలసంధి ప్రాధాన్యాన్ని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచ వ్యాప్తంగా చమురు రవాణాకు కీలకమైన ఈ మార్గం సురక్షితంగా, అందరికీ అందుబాటులో ఉండటం అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరా పరంగా ఇది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో యుద్ధ విరమణ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కొద్ది రోజులపాటు దాడులను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన వెంటనే ఈ ఫోన్ కాల్ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

శాంతి, స్థిరత్వం కోసం జరిగే అన్ని దౌత్య ప్రయత్నాలకు భారత్ అండగా ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచ శాంతి కోసం సమన్వయం, సంభాషణే మార్గమని మరోసారి భారత్ తన వైఖరిని వెల్లడించింది.

Sairam K

Recent Posts

కార్న్ తింటే షుగర్ పెరుగుతుందా? డాక్టర్లు చెప్పిన క్లారిటీ..!

మధుమేహం ఉన్నవారు ఏ ఆహారం తీసుకోవాలి, ఏది మానుకోవాలి అన్న సందేహం ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా తీపి పదార్థాల విషయంలో…

1 day ago

విజయశాంతి చెప్పిన ఒక్క మాట.. వరలక్ష్మి జీవితానికి టర్నింగ్ పాయింట్..

తెలుగు సినీ రంగంలో సీనియర్ నటి వరలక్ష్మి తన సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా…

1 day ago

షుగర్ పేషెంట్స్ గుడ్లు తింటే నిజంగా ఏమవుతుంది?

డయాబెటిస్ ఉన్నవారు గుడ్లు తినకూడదనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, సరైన పరిమితిలో…

1 day ago

తమలపాకులో దాగిన ఔషధ గుణాలు.. మీకు తెలుసా?

ఇంట్లో సులభంగా దొరికే కొన్ని సహజ పదార్థాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అలాంటి వాటిలో ఒకటి తమలపాకు. సాధారణంగా…

1 day ago

గ్యాస్ మంట పసుపుగా ఉందా? ఇది ప్రమాద సూచన కావచ్చు!

వంటగదిలో గ్యాస్ స్టవ్ మంట సాధారణంగా నీలం రంగులో ఉండాలి. కానీ అదే మంట పసుపు రంగులో కనిపిస్తే, దాన్ని…

1 day ago

గాల్లోనే ఇంజిన్ ఫెయిల్.. 161 మందితో విమానం సేఫ్ ల్యాండింగ్!

విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఓ ప్రయాణికుల విమానంలో చోటుచేసుకున్న సాంకేతిక లోపం కాసేపు ఉత్కంఠకు దారి తీసింది. ఇండిగోకు…

1 day ago