తెలంగాణ సర్కార్ చాలా సంవత్సరాలుగా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జీవో విడుదల చేసి రాష్ట్రంలోని 126 మంది ఖైదీలకు క్షమాభిక్ష కింద విడుదల చేయడానికి సిద్ధమైంది. ఆవేశంలో చేసిన తప్పుల వల్ల అనేక సంవత్సరాలుగా జైళ్లలో మగ్గిపోతున్న 126 మంది ఖైదీల క్షమాభిక్షకు లైన్ క్లియర్ అయింది. హోం శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం వెలువడింది.
ప్రిన్సిపల్ సెక్రెటరీ రవి గుప్త అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జైళ్లశాఖ డీజీ రాజీవ్ త్రివేది, లా సెక్రటరీ సంతోష్, డీజీపీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. హోం శాఖ ఖైదీల క్షమాభిక్షకు సంబంధించిన ఫైల్ ను సీఎం కేసీఆర్ కు పంపగా ఆ ఫైల్ అక్కడి నుంచి కేసీఆర్ దగ్గరకు వెళ్లింది. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఫైల్ పై సంతకం చేయడంతో ఖైదీల విడుదలకు లైన్ క్లియర్ అయింది.
క్షమాభిక్ష ఫైల్ పై గవర్నర్ అమోద ముద్ర వేయాల్సి ఉంది. గవర్నర్ ఆమోద ముద్ర లభిస్తే గాంధీ జయంతి సందర్భంగా 126 మంది ఖైదీలు విడుదల కానున్నారు. ప్రభుత్వం గతంలోనే ఖైదీల విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను రెండు రోజుల క్రితం విడుదల చేసింది. ప్రధాన కేంద్ర కారాగారాలలో సంవత్సరాల తరబడి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం పొందనున్నారు.
రాష్ట్ర హోం శాఖ నుండి దీనికి సంబంధించిన జీవో నంబర్ 30 విడుదలైంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను, వయస్సు మీద పడిన వారిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…