Bigg Boss Nonstop: బిగ్ బాస్ నాన్ స్టాప్... మొదటి వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్న కంటెస్టెంట్ ఎవరు?
Bigg Boss OTT : తెలుగు బుల్లితెరపై ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకాదరణను అందుకుని బిగ్గెస్ట్ రియాలిటీ షోగా నిలిచింది ” బిగ్ బాస్ “. తక్కువ సమయంలోనే విశేషమైన రెస్పాన్స్‌ను దక్కించుకుని సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది ఈ షో. ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తిన్ చేసుకోని త్వరలోనే కొత్త సీజన్ కు రెడీ అవుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌తో నిర్వహకులు సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు.
ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు. దీనికి కూడా అక్కినేని నాగార్జునే హోస్టుగా చేయబోతున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌తో హిందీలో గత ఏడాది ప్రసారం చేశారు. అక్కడ ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీన్ని బిగ్ బాస్ సీజన్ మాదిరిగా టీవీలో ప్రసారం చేయరు. కేవలం ప్రముఖ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనే ప్రసారం చేస్తారు.
అంతేకాదు, దీన్ని 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఫిబ్రవరి నెల నుంచి బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్ ప్రారంభం కాబోతుంది అని అంటున్నారు. ఇది మొత్తం 82 రోజుల పాటు సాగనుందని తెలుస్తోంది. ఇక, ఇందులో 15 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారని అంటున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్లకు సంబంధించిన షార్ట్ లిస్ట్ కూడా రెడీ అయిందని తెలిసింది.
తాజా సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ ఓటీటీలోకి సీరియల్ హీరోయిన్ నవ్య స్వామి ఎంట్రీ ఇవ్వబోతుందట. ఇప్పటికే ఆమె అగ్రిమెంట్‌పై సైన్ కూడా చేసిందట. బుల్లితెరపై చాలా కాలంగా వరుస సీరియళ్లతో నవ్య స్వామి సందడి చేస్తోంది. ఇక, ఇప్పుడు జీ తెలుగులో ‘సూపర్ క్వీన్’, ఈటీవీలో ‘ఢీ 14′ షోలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వహకులు ఆమెకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని తెలుస్తోంది. దీనికి టెంప్ట్ అయిన నవ్య స్వామి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. దీంతో ఆమె ఓటీటీ కంటెస్టెంట్‌గా రాబోతుందని అంటున్నారు. దీంతో ఆమె అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…