Categories: Featured

Tv serial Actresses remuneration : మనం రోజు చూసే ఈ బుల్లి తెర హీరోయిన్ల రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!

Tv serial Actresses remuneration : సినిమాలో హీరో హీరోయిన్లకు ఎంత క్రేజ్ ఉన్న బుల్లితెర హీరో హీరోయిన్లకు మాత్రం మహిళా ప్రేక్షకులకు ఆదరణ మాములుగా ఉండదు. సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ సీరియల్స్ అలా కాదు ఒకసారి ఒక సీరియల్ మొదలయిందంటే కొన్నేళ్లు వస్తుంటుంది. దీంతో ఇంట్లో కుటుంబ సభ్యుల లాగానే సీరియల్ లో నటినటులను ప్రేక్షకులు ఫీల్ అవుతూ ఉంటారు. నిజానికి ఆ ఎమోషన్ తోనే చాలా సీరియల్స్ లో అసలు ఏ మాత్రం కథ లేకపోయినా ప్రేక్షకధారణతో దూసుకుపోతున్నాయి. ఇక అలాంటి సీరియల్స్ లో నటిస్తూ అలరిస్తున్న కొంతమంది ముద్దు గుమ్మల రెమ్యూనరేషన్ షాకిస్తోంది.

వంటలక్క నుండి మీనాక్షి వరకు ఒక రోజు రెమ్యూనరేషన్….

సీరియల్స్ లో ఇప్పుడు నచ్చే సీరియల్ అంటే చెప్పడం కష్టం కానీ పాపులర్ సీరియల్ అంటే మాత్రం మా టీవీ లో వచ్చే కార్తీక దీపం సీరియల్ అని చెప్పొచ్చు. ఆ సీరియల్ బుల్లితెర మీద బాహుబలి లాంటిది. రేటింగ్స్ లో దూసుకుపోతున్న ఈ సీరియల్స్ లో మొన్నా మధ్య డైరెక్టర్ కొత్తతరం తో కంటిన్యూ చేయాలనుకున్న డాక్టర్ బాబు వంటలక్క లేని సీరియల్స్ మేమెందుకు చూస్తాం అన్నట్లు గా రేటింగ్స్ పడిపోడం తో మళ్ళీ కథను మార్చి వంటలక్క, డాక్టర్ బాబు ను కథలోకి తీసుకోచ్చాడు. ఇక ఎన్ని వంటలు చేసిన ఇంత ఫేమస్ అవుతారో లేదు కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వంటలక్క అనగానే కార్తీక దీపం సీయల్ ప్రేమి విశ్వనాధ్ గుర్తొస్తుంది. మొదటి సీరియల్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రేమి రెమ్యూనరేషన్ కూడా హై లోనే ఉంది మరీ ఒక రోజుకు ఇరవై ఐదు వేలా పారితోషకం ఈ మళయాలి కుట్టి తీసుకుంటోంది.

ఇక నా పేరు మీనాక్షి అంటూ ఈటీవీ లో కొన్నేళ్లు గా వస్తూ ఈ మధ్య ఢీ వంటి షోలతోను అలరిస్తున్న నవ్య స్వామి ఇరవై వేల పారితోషకం తీసుకుంటోంది. వీళ్ళే కాకుండా హీరోయిన్ గా అడుగుపెట్టి మళ్ళీ బుల్లితెర వైపు అడుగులేసిన దేవత సీరియల్ సుహాసిని కూడా 20 వేల రెమ్యూనరేషన్ ఒక రోజు కు తీసుకుంటోంది. ఇక అగ్నిసాక్షి తో ఫేమస్ అయిన ఐశ్వర్య కూడా 20 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. ఇక ఆడదే ఆధారం సీరియల్ తో పాపులర్ అయి ప్రస్తుతం పాపే మా జీవన్ జ్యోతి సీరియల్ లో నటిస్తున్న పల్లవి 15 వేలు తీసుకుంటోంది. జీ టీవిలో వచ్చే త్రినయని తో ఫేమస్ అయిన ఆశిక 12 వేలు అలాగే సీనియర్ ఆర్టిస్ట్ హరిత కూడా రోజుకు 12 వేల పారితోషకం తీసుకుంటున్నారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago