సాధారణంగా తమ జీవితం అలా ఉండాలి ఇలా ఉండాలని ప్రతి ఒక్కరు ఎన్నో కలలు కంటారు. అయితే అందరికీ వారి కలలు నెరవేరవు. కేవలం తమ కలలను నెరవేర్చుకోవడం కోసం నిరంతరం కృషి చేసే వారికి మాత్రమే వారు అనుకున్నది సాధించి మంచి గుర్తింపును సంపాదించుకుంటారు.ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వారి సంకల్పం వదలకుండా ప్రయత్నిస్తే వారి కష్టానికి ఫలితం తప్పకుండా తగ్గుతుంది.
ఈ క్రమంలోని అమెరికాకు చెందిన ఐడెంటి ట్విన్స్ సిస్టర్స్ తమ కలల నెరవేర్చుకోవడం కోసం పోటీపడి మరీ కష్టపడ్డారు. చదువులో అత్యధిక మార్కులు సాధించాలనే సిస్టర్స్ ఇద్దరు ఎంతో కష్టపడ్డారు. నేడు ఆ కష్టానికి తగ్గ ఫలితం రావడంతో సెలబ్రిటీగా మారిపోయారు.
అమెరికాలోని లూసియానాకు చెందిన డెనీసా, డెస్టినీ కాడ్‌వెల్ ఐడెంటికల్ ట్విన్ సిస్టర్స్. వీరు స్కాట్‌లాండ్ విల్లే మాగ్నెట్ హై స్కూల్‌లో చివరి ఏడాది చదువుతున్నారు. ఇద్దరు చదువులలో ఒకరికొకరు పోటీపడి మరీ చదివారు. ఈ క్రమంలోనే డెస్టినీ 4.0 జీపీఏ, డెనీసా 3.95 జీపీఏ సాధించి స్కూల్ టాపర్స్‌గా నిలిచారు.
అత్యధిక జీపీఏ సాధించిన ఈ ట్విన్ సిస్టర్స్ కి 24 మిలియన్ డాలర్ల స్కాలర్‌షిప్‌లు కూడా వరించాయి. ఇది మాత్రమే కాకుండా వీరికి దాదాపు 200 కాలేజీల నుంచి తమ కాలేజ్ కి చేరాలంటూ ఆఫర్లను కూడా ప్రకటించడం ఎంతో విశేషం. ఈ విధంగా చదువులో టాపర్లుగా నిలిచిన ఈ సిస్టర్స్ ఇప్పుడు అంతర్జాతీయ సెలబ్రిటీలుగా మారారు.
ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ మనల్ని కృంగదీసే విషయాలు బుర్రలోనికి రాకుండా దాన్ని మోటివేషన్ గా తీసుకోవాలని తమ సక్సెస్ ఫార్ములా అని తెలిపారు. వీరు కేవలం చదువులోనే కాదు.. డ్యాన్స్, సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉండటం విశేషం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…