General News

పిల్లల్లో కనిపించే కరోనా లక్షణాలు ఇవే..?

దేశవ్యాప్తంగా కరోనా మొదటి దశ వ్యాప్తి చెందినప్పుడు వ్యాధి తీవ్రత కేవలం వయసు పైబడిన వారిలోనే చూపించింది. యుక్తవయసు వారిలో చిన్న పిల్లల్లో ఈ వ్యాధి తీవ్రత పెద్దగా కనిపించలేదు. దీంతో వయసు పైబడినవారు కరోనా బారినపడి మృత్యువాత పడ్డారు.ఈ క్రమంలోనే కొన్ని నెలల అనంతరం కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో యధావిధిగా ప్రజలందరూ ఏమాత్రం కరోనా జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవహరించడం వల్ల కరోనా వైరస్‌లో కొత్త మ్యుటేషన్లు పుట్టుకొచ్చాయి.

ప్రస్తుతం కరోనా వైరస్ రెండవ దశ తీవ్రస్థాయిలో విజృంభిస్తుంది. రెండవ దశ వయసు వారిలోనే కాకుండా చిన్న పిల్లలలో కూడా తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలోనే చిన్నపిల్లలలో కూడా కరోనా వైరస్ లక్షణాలు కనిపించి మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే పిల్లలలో కరోనా లక్షణాలు ఏమిటి?లక్షణాలు కనిపిస్తే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం గురించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అనేక మార్గాలు, మార్గదర్శకాలతో కూడిన జాబితాను విడుదల చేసింది.

కరోనా బారిన పడిన పిల్లలలో జ్వరం, జలుబు, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరిలో వాంతులు-విరేచనాలు, కండరాల నొప్పి, ముక్కు నుంచి నీరు కారడం వంటి లక్షణాలు కనబడితే తప్పకుండా అది కరోనా అని భావించాలి. చిన్నపిల్లలలో నొప్పి ఎక్కువగా ఉంటే వారు చెప్పలేరు కనుక ఎక్కువగా ఏడుస్తుంటారు.

ఈ విధమైన లక్షణాలు కనిపించిన పిల్లలు కరోనా బారిన పడి ఉంటారు. అయితే చిన్న పిల్లలు కరోనా నుంచి తొందరగా కోలుకుంటారని కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరికొందరిలో ఎటువంటి లక్షణాలు కనబడకుండా వారు కరోనా బారినపడి ఉంటారు.ఈ విధమైన లక్షణాలు లేకుండా కరోనాకు గురైన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచి చికిత్స అందించవచ్చని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago