ప్రతీ ఒక్కరి జీవితంలో పుట్టిన రోజు, పెళ్లి రోజు మరేదైనా ఒక రోజు అనేది స్పెషల్ గా ఉంటుంది. ఆ రోజును స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు. అలా ఆ రోజును ఎప్పుడైనా తలచుకుంటే ఆనంద పడేవిధంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఆ సంతోషంలోనే కొంత మందికి గాల్లో ఎగరాలని అనిపిస్తుంటుంది. రోలర్ కోస్టర్‌పై సరదాగా తిరగాలి అనిపించడం కూడా ఈ కోవలోకి వస్తుంది. అయితే ఓ మహిళకు ఓ వింత అనుభవం ఎదురైంది. ఇంతకు ఏం జరిగిందంటే..
అమెరికాలోని న్యూజెర్సీలో ఇద్దరు అమ్మాయిలు తమ పుట్టిన రోజు వేడుకలను ఎప్పటికీ మర్చిపోకుండా గడపాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే ఓ మంచి ప్లాన్ వేసుకున్నారు. రోలర్ కోస్టర్‌పై ఎక్కాలని నిర్ణయం తీసుకొని ఎక్కేశారు. రోలర్ కోస్టర్ పై ఎక్కిన తర్వాత అది ఒక రైడ్ తర్వత మరో రైడ్ వేసుకుంటూ ఉంది.
ఒక రెండు మూడు రౌండ్ల తర్వాత గాలిలో ఓ అమ్మాయిపై సీగల్ పక్షి వచ్చి పడింది. ఇంకేముంది.. అప్పటికే భయంతో ఉన్న ఆ మహిళ బిగ్గరగా అరవడం మొదలు పెట్టింది. ఆ అరుపులు మాత్రం ఎవరకీ వినిపించలేదు. పక్కనే కూర్చున్న మరో మహిళ కళ్లు మూసుకొని తన భయాన్ని భయటపెట్టకుండా ధైర్యంగా ఉండటం చేస్తోంది. దీంతో ఆమె ఈ విషయాన్ని గమనించలేదు. చివరకు ధైర్యం చేసి పక్షిని తనే స్వయంగా తీసివేసి ఊపిరి పీల్చుకుంది.
ఈ తంతంగం మొత్తం వీడియోను సోషల్ మీడియా యూజర్ టైరోన్ పవర్ పోస్ట్ చేయగా ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. రోలర్ ను ఎక్కడం మీకు మంచి అనుభవాన్ని ఇచ్చినట్లుయిందంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేయగా.. మరో వ్యక్తి ఇలా చేశాడు. పుట్టిన రోజు శుభాకాంక్షలు.. మీ భయం నిజమైది.. దెబ్బకు సచ్చేంత పనైందంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…