సినిమా చూడటం అంటే.. థియేటర్ కు వెళ్లాలి.. అక్కడ సీట్లలో కూర్చొని చూస్తే ఆ ఫీలింగే వేరు. సినిమా చూస్తే థియేటర్ లోనే చూడాలి. పెద్ద స్క్రీన్ మీద.. పెద్ద పెద్ద సౌండ్ తో సినిమా చూస్తే వచ్చే ఫీలింగే వేరు. కానీ.. కరోనా వచ్చినప్పటి నుంచి థియేటర్ల పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. థియేటర్లు ఎక్కువ కాలం మూతపడటంతో.. ఓటీటీలు లైమ్ లైట్ లోకి వచ్చాయి. మనిషికి ఎంటర్ టైన్ మెంట్ లేకపోతే బతకలేడు. ఎన్నో పనుల్లో బిజీగా ఉండి.. టెన్షన్ ను వదిలేసుకోవడం కోసం.. ప్రశాంతంగా కాసేపు ఎంజాయ్ చేయడం కోసం జనాలు థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తారు. రిలాక్స్ అవుతారు.
కానీ.. ఇప్పటి పరిస్థితులు అలా లేవు. చాలా మారిపోయాయి. కరోనా వల్ల.. థియేటర్లు మూత పడటంతో.. సినిమాలు ఎక్కడ రిలీజ్ చేయాలి. పెద్ద పెద్ద సినిమాలు కూడా థియేటర్లు లేక రిలీజ్ కు వెయిటింగ్ లో ఉన్నాయి. ఒకవేళ థియేటర్లు తెరుచుకోకపోతే.. సినిమాల పరిస్థితి ఏంటి? అలా వెలుగులోకి వచ్చి.. ప్రస్తుతం సినిమా రంగంలో సరికొత్త మార్పులను తీసుకొచ్చాయి ఓటీటీలు. తెలుగులో ఆహా అనే ఓటీటీ.. ఇంకా పలు రకాల భాషల సినిమాలకు సంబంధించి.. అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, సన్ నెక్స్ట్, నెట్ ఫ్లిక్స్.. ఇలా పలు ఓటీటీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
అయితే.. సినిమా చూడటం అంటే.. థియేటరే అన్న ధోరణి ఇక ప్రస్తుతం మారిపోయింది. సినిమాలు ఇప్పుడు డైరెక్ట్ గా ఇంట్లోనే రిలీజ్ అయిపోతున్నాయి. గత సంవత్సరం వీ అనే సినిమా కూడా అలాగే ఓటీటీలో రిలీజ్ అయింది. చిన్న చిన్న సినిమాలే కాదు.. పెద్ద పెద్ద సినిమాలను కూడా ఈ మధ్య ఓటీటీలలో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా.. నారప్ప అనే సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేశారు. అయితే.. నారప్ప అనేది చిన్న సినిమా కాదు. అది చాలా పెద్ద సినిమా. ఆ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. కానీ.. ఆ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడంతో ముందు చాలా విమర్శలు వచ్చాయి.
అయితే.. నారప్ప సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకున్నప్పుడు చాలామంది వద్దన్నారట. నిర్మాత సురేశ్ బాబు.. బాగా ఆలోచించి.. నారప్ప సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుండగా.. ఆయనకు తెలిసిన వాళ్లు, మిత్రులు, ఇతరులు, సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు.. వార్నింగ్ కూడా ఇచ్చారట. ఇలా.. తొందర పడి ఓటీటీలో రిలీజ్ చేయకు.. అంటూ బెదిరించారట. చాలామంది కొప్పడ్డారట. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఒకింత అసహనానికి గురయ్యారట. కానీ.. మరో నిర్మాత కలైపులి ఎస్ తాను ఓటీటీలో మంచి ఆఫర్ వచ్చిందని.. ఇప్పటికే చాలా రోజులు వెయిట్ చేశామని చెప్పడంతో.. సురేశ్ బాబు కూడా ఓకే చెప్పారట.
అయితే.. నారప్ప సినిమా థియేటర్ సినిమా. థియేటర్ లో చూసి.. ఎంజాయ్ చేయాల్సిన సినిమా. కానీ.. తప్పని పరిస్థితుల్లో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చిందని సురేశ్ బాబు తెలిపారు. అలాగే.. ఈ సినిమాకు కూడా అమెజాన్ ఓటీటీ నుంచి మంచి ఆఫర్ వచ్చిందట. అందుకే.. ఇక తప్పని పరిస్థితుల్లో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చిందని సురేశ్ బాబు స్పష్టం చేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…