Featured

పుట్టిన రోజు వేడుక.. మరువలేదిక.. ఇంతకు ఏమైందంటే..?

ప్రతీ ఒక్కరి జీవితంలో పుట్టిన రోజు, పెళ్లి రోజు మరేదైనా ఒక రోజు అనేది స్పెషల్ గా ఉంటుంది. ఆ రోజును స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు. అలా ఆ రోజును ఎప్పుడైనా తలచుకుంటే ఆనంద పడేవిధంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఆ సంతోషంలోనే కొంత మందికి గాల్లో ఎగరాలని అనిపిస్తుంటుంది. రోలర్ కోస్టర్‌పై సరదాగా తిరగాలి అనిపించడం కూడా ఈ కోవలోకి వస్తుంది. అయితే ఓ మహిళకు ఓ వింత అనుభవం ఎదురైంది. ఇంతకు ఏం జరిగిందంటే..

అమెరికాలోని న్యూజెర్సీలో ఇద్దరు అమ్మాయిలు తమ పుట్టిన రోజు వేడుకలను ఎప్పటికీ మర్చిపోకుండా గడపాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే ఓ మంచి ప్లాన్ వేసుకున్నారు. రోలర్ కోస్టర్‌పై ఎక్కాలని నిర్ణయం తీసుకొని ఎక్కేశారు. రోలర్ కోస్టర్ పై ఎక్కిన తర్వాత అది ఒక రైడ్ తర్వత మరో రైడ్ వేసుకుంటూ ఉంది.

ఒక రెండు మూడు రౌండ్ల తర్వాత గాలిలో ఓ అమ్మాయిపై సీగల్‌ పక్షి వచ్చి పడింది. ఇంకేముంది.. అప్పటికే భయంతో ఉన్న ఆ మహిళ బిగ్గరగా అరవడం మొదలు పెట్టింది. ఆ అరుపులు మాత్రం ఎవరకీ వినిపించలేదు. పక్కనే కూర్చున్న మరో మహిళ కళ్లు మూసుకొని తన భయాన్ని భయటపెట్టకుండా ధైర్యంగా ఉండటం చేస్తోంది. దీంతో ఆమె ఈ విషయాన్ని గమనించలేదు. చివరకు ధైర్యం చేసి పక్షిని తనే స్వయంగా తీసివేసి ఊపిరి పీల్చుకుంది.

ఈ తంతంగం మొత్తం వీడియోను సోషల్ మీడియా యూజర్ టైరోన్ పవర్ పోస్ట్ చేయగా ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. రోలర్ ను ఎక్కడం మీకు మంచి అనుభవాన్ని ఇచ్చినట్లుయిందంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేయగా.. మరో వ్యక్తి ఇలా చేశాడు. పుట్టిన రోజు శుభాకాంక్షలు.. మీ భయం నిజమైది.. దెబ్బకు సచ్చేంత పనైందంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago