Featured

యజమాని ప్రాణాలు కాపాడిన శునకాలు.. పామును రెండు ముక్కలు చేసి.. చివరకు..

విశ్వాసానికి మారు పేరు శనకాలు అని మనం వింటూ ఉంటాం. మనం వాటిని దగ్గరకు తీసుకొని ఆత్మీయతను పంచితే అవి మనం చనిపోయే వరకు కూడా చేసిన సాయాన్ని మర్చిపోవట. అంత విశ్వాసంగా ఉంటాయట శునకాలు. అంత విశ్వాసంగా ఉంటాయి కాబట్టే.. ఇక్కడ తన యజమాని ప్రాణాలు కాపాడేందుకు వాటి ప్రాణాలను సైతం అడ్డు పెట్టాయి.

అసలు విషయం ఏంటంటే.. రెండు కుక్కలు తమ ఓనర్ ప్రాణాలను కాపాడేందుకు విషపూరితమైన పాముతో తలపడ్డాయి. అతడి ప్రాణాలు కాపాడే తరుణంలో అవి ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఈ ఘటన విన్న ప్రతీ ఒక్కరూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. రాజన్ అనే వ్యక్తి భడోహిలోని జైరాంపూర్ గ్రామంలో నివసిస్తున్నాడు. అతడు రెండు కుక్కలను పెంచుకుంటున్నాడు. రాత్రి ఓ నల్లటి విష సర్పం వాళ్ల ఇంట్లోకి చొరబడింది.

దానిని పసిగట్టిన కుక్కలు అరవడం మొదలు పెట్టాయి. ఇంట్లోకి వెళ్తుండగా రెండు కుక్కలు దానిపై దాడి చేశాయి. ఇంట్లోకి ప్రవేశించకుండా దాదాపు రెండు గంటల సేపు పోరాడాయి. చివరకు ఆ పాము రెండు ముక్కలు చేసి చంపేశాయి. అయితే ఈ దాడిని చూసిన స్థానికులు హడలిపోయారు. ఆ పాము నుంచి రెండు కుక్కలను కాపాడేందుకు వాళ్లు ప్రయత్నించారు. కానీ అవి పామును చంపేంత వరకు వదిలిపెట్టలేదు. ఆ పాము కుక్కలను చాలాచోట్ల కాటు వేసింది.

పామును చంపిన కొద్ది నిమిషాల తర్వాత శునకాలు కూడా చనిపోయాయి. విషయం తెలుసుకున్న యజమాని తల్లి తల్లడిల్లిపోయింది. ఈ నిజాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని రాజన్ మీడియాతో చెప్పాడు. అయితే వాటికి దహన సంస్కారాలు చేసిన యజమాని.. వాటి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. క్షణాల్లోనే వైరల్ అయ్యాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago