మందుబాబులు మందు కొట్టారంటే.. వాళ్ల వీరంగం మామూలుగా ఉండదు. ఎక్కడ లేని ధైర్యం కూడకట్టుకొని ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియకుండా ప్రవర్తిస్తుంటారు. ఇష్టం వచ్చినట్లు నోటి నుంచి ఏది వస్తే అది మాట్లాడుతారు. ఇలా ఓ ఇద్దరు యువకులు ఫుల్ గా మద్యం సేవించి .. ఓ పామును వాళ్లు ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎవరికైనా పాములు అంటే భయపడతారు. ఓ ప్రదేశంలో పాము ఉందంటే.. మరుసటి రోజు అటు వెళ్లడానికి కూడా సాహసించం. ఛత్తీస్‌గఢ్‌లో కోర్భాలో రాజు, హితేంద్ర అనే ఇద్దరు వ్యక్తులు స్నేహితులు. ఓ రోజు అతిగా మద్యం తాగారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అక్కడ ఓ పాము చనిపోయి.. కాలిన శరీరంతో కనిపించింది. అయితే మద్యం తాగిన వాళ్లు.. ఆ పాము బతికే ఉందనుకొని.. ఎవరి ఇళ్లల్లోకైనా వెళ్తే.. ప్రమాదం ఉంటుందని ఎకంగా ఇద్దరు కలిసి దానిని.. ముక్కలు ముక్కలు చేసి తినేశారు.
కొద్ది సేపటి తర్వాత కడుపులో తిప్పడం.. తల తిరగడం వంటివి చేశాయి. దీంతో వాళ్ల మత్తు అంతా దిగడమే కాకుండా.. తిన్నదంతా అక్కడే కక్కేశారు. ఆ పాము కనిపించిన ప్రదేశంలో చివరకు సృహ కోలిపోయి పడిపోయారు. అటుగా వెళ్తున్న స్థానికులు వాళ్లను గమనించి .. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజు, హితేంద్ర చికిత్స పొందుతున్నారు. ప్రాణాలకు ఎలాంటి నష్టం లేదంటూ వైద్యులు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…