ప్రేక్షకులు ఎంతో ఎదురు చూసే బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ఎట్టకేలకు ఆదివారం ఎంతో అట్టహాసంగా మొదలైంది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ లు అందరూ ఒక్కొక్కరుగా బిగ్ బాస్ హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సీజన్ ఫైవ్ లోకి ఏకంగా 19మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వీరిలో 17వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు ఆర్.జే కాజల్. ఈమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, యూట్యూబ్ ఛానల్ ద్వారా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ బాగా ఫేమస్ అయ్యారు.
ఇలా యూట్యూబ్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న కాజల్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు. అయితే ఈమె గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.. ఇండస్ట్రీలో అందరికీ కాజల్ గా పరిచయమైన ఈమె అసలు పేరు రహిమునిస్సా మెహ్ సబీనా. ఈమె తండ్రి రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూ రిటైర్ కాగా అమ్మ హౌస్ వైఫ్. వీరు ముగ్గురు అమ్మాయిలు కాగా కాజల్ చిన్నమ్మాయి.
చదువు పరంగా కాజల్ ఎమ్మెస్సీ పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లోనే ఈమెకు పాటలు పాడటం అంటే ఎంతో ఇష్టం ఉండటం వల్ల పాఠశాలలో పలు కార్యక్రమాలలో పాటలు పాడుతూ ఉండేది. ఇలా తన చదువును కొనసాగిస్తున్న సమయంలో హిందూ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి అయిన తర్వాత విజయవాడలో కృష్ణ అనే ఓ వ్యక్తి ద్వారా ఎఫ్.ఎంలో ఆడిషన్ ఇవ్వడంతో ఈమెని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. వీరికి ఒక పాప కూడా ఉంది.
ఈ విధంగా హైదరాబాద్ చేరుకున్న కాజల్ ఎఫ్.ఎంలో సక్సెస్ అందుకున్నారు. మొట్టమొదటిసారిగా “నిన్ను కలిసాక “అనే చిత్రానికి డబ్బింగ్ చెప్పారు. ఇలా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కాజల్ సుమారు 100 చిత్రాలకు పైగా డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా మంచు మనోజ్ ,తాప్సీ నటించిన “ఝుమ్మందినాదం” అనే సినిమాలో 30 సెకండ్ల పాటు కనిపించింది.
సుమారు 14 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ లో ఉంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న కాజల్ కు సూర్య, తమన్నా తన ఫేవరెట్ హీరో హీరోయిన్ లని ఓ సందర్భంలో వెల్లడించారు. ఈ విధంగా ఇండస్ట్రీలో కొనసాగుతూ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరింత పాపులారిటీ అయిన కాజల్ హిందీ బిగ్ బాస్ చూస్తూ ఎలాగైనా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని భావించేది. కానీ ఇన్ని రోజులకు తనకు తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో అవకాశం వచ్చింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…