బిగ్ బాస్ సీజన్ 5 లోకి 17 వ కంటెస్టెంట్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు ఆర్. జే. కాజల్. ఈమె హౌస్ లోకి రాగానే ఎంతో ఎగ్జయిట్ అవుతూ హౌస్ మొత్తం కలియతిరుగుతూ ఎంతో సంబరపడ్డారు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజే అందరి దగ్గరకు వెళ్లి వారి వ్యక్తిగత విషయాలను అడిగి తెలుసుకుంటూ ఎంతో చురుకుగా ప్రవర్తించారు. అయితే హౌస్ లోకి వెళ్ళినప్పటినుంచి ఆమె ప్రవర్తన గమనిస్తూ ఉన్న తోటి కంటెస్టెంట్ లు చాలా ఓవర్ చేస్తుందని భావించారు.
కాజల్ ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా ప్రవర్తిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.తాజాగా మంగళవారం జరిగే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో అందులో లహరితో గొడవ పడిన కాజల్ ఏడవడం చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున ఈమెపై ట్రోలింగ్ చేస్తున్నారు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు బిగ్ బాస్ తన కలల హౌస్ అంటూ డ్రీమ్ కార్ పట్టుకున్న ఈమె ఇప్పుడు చైల్డ్ కార్డు పట్టుకొని ఏడుస్తున్నారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ విన్నర్ గా నిలిచిన అభిజిత్ గురించి నెగిటివ్ గా మాట్లాడారు. అభిజిత్ పిఆర్ టీం పెట్టుకున్నాడని ఈమె మాట్లాడటంతో అభిజిత్ ఫాన్స్ కామెంట్లు పెడుతున్నారు. కాజల్ బిగ్ బాస్ హౌస్ లో ఒక వైరస్ లా వ్యవహరిస్తోందని, వీలైనంత తొందరగా ఆమెను హౌస్ నుంచి బయటకు పంపించడం ఎంతో మంచిదని అభిజిత్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
ఈ క్రమంలోనే కాజల్ ఫ్యాన్స్ స్పందిస్తూ.. ఆమె ఎగ్జైట్మెంట్ ను అందరు తప్పుగా భావిస్తున్నారు, ఆమె ఆట చూసి మాట్లాడితే బాగుంటుంది అంటూ కాజల్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. హౌస్ లోకి వెళ్ళిన మొదటి రెండు రోజులకే కాజల్ ఈ విధమైనటువంటి నెగిటివిటీను సంపాదించుకోవడమే కాకుండా ఈ నెగిటివిటీ నుంచి ఎలా బయటపడతారో తెలియాల్సి ఉంది.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…