Uday Kiran : అతి తక్కువ సినిమాలతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ హీరోలలో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు. ఎంత తొందరగా స్టార్ హీరోలలో ఒకరుగా నిలబడ్డారో, అంతే తొందరగా ఫేడ్ అవుట్ అయిపోయారు. సినిమా ఆఫర్లు లేక ఆర్ధిక కష్టాలతో ఆత్మహత్య చేసుకొని ఇప్పటికి 10 సంవత్సరాలు కావొస్తున్నా అభిమనులు ఇంకా ఆయనను గుర్తు చేసుకుంటూనే ఉంటారు. లవర్ బాయ్ గా ఇప్పటికీ అభిమానులలో చెరగని ముద్ర వేసుకున్నారు.
ఆ సినిమా చేసి ఉంటే ఇపుడు స్టార్ హీరోలలో ఒకరిగా ఉండేవారు…
ఉదయ్ కిరణ్ ఫెయిల్యూర్ వెనుక కొద్దిగా అయన తప్పులు కూడా ఉన్నాయని అభిమానులు అభిప్రాయ పడుతుంటారు. వరుసగా ప్రేమకథా చిత్రాలే తీయడం వలన ఉదయ్ కిరామ్ సినిమాలు బోర్ కొట్టాయని, మాస్ సినిమాలు, కుటుంబ కథా చిత్రాలు తీసివుంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. చివర్లో ‘జై శ్రీరామ్’ సినిమాతో తన పంతా మార్చుకున్నా అప్పటికే అంతా జరిగిపోయిందని అనుకుంటున్నారు.
అంతేకాదు రాజమౌళి సినిమాను ఉదయకిరణ్ వద్దు అన్నాడన్న వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. ‘సై’ సినిమాను మొదట రాజమౌళి ఉదయకిరణ్ తో తీయాలని భావించి అడిగితె నో చెప్పారట, తరువాత నితిన్ తో తీయడం జరిగిందట. అయితే అప్పుడు రాజమౌళితో సినిమా తీసి ఉన్నింటే ఇపుడు ఉదయ్ కిరణ్ స్టార్ హీరోలా ఉండేవారు అని అభిమానులు అనుకుంటున్నారు. ఆ నిర్ణయమే ఆయన జీవితం నాశనం అయిపోవడానికి దారి తీసిందని భావిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…