Uday Kiran: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సినిమా ద్వారా పరిచయమైనటువంటి ఉదయ్ కిరణ్ మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ అందుకున్నారు. అనంతరం తేజ దర్శకత్వంలో నటించిన నువ్వు నేను సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ అనిత హీరో హీరోయిన్లుగా ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో వచ్చినటువంటి ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే తాజాగా ఈ సినిమాని తిరిగి విడుదల చేయడానికి మేకర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసిందే .ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.
నువ్వు నేను..
ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ నటించిన ఈ సినిమాని కూడా తిరిగి విడుదల చేయాలని మేకర్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా మార్చి 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇలా చాలా రోజుల తర్వాత తిరిగి ఉదయ్ కిరణ్ సినిమాని థియేటర్లో చూడబోతున్నామని తెలిసి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా కనుక తిరిగి రిలీజ్ అయితే బ్లాక్ బస్టర్ కావడం పక్కా అంటూ అభిమానులు భావిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…