Featured

చేయని తప్పుకు ఉదయ్ మా కో డైరెక్టర్ మీద అరిచారు.. చనిపోయే ముందురోజు చాలా సేపు ఫోన్ లో మాట్లాడాడు.. : డైరెక్టర్ విఎన్ ఆదిత్య..!

వి.ఎన్.ఆదిత్య దర్శకుడిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈయన 2001 సంవత్సరంలో ఉదయ్ కిరణ్ రీమాసేన్ జంటగా నటించిన మనసంతా నువ్వే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఉదయ్ కిరణ్ డైరెక్టర్ ఆదిత్య కాంబినేషన్లో శ్రీ రామ్ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఉదయ్ కిరణ్ తన కో-డైరెక్టర్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని తాజాగా వి.ఎన్.ఆదిత్య ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ కి అప్పటికే వేరే సినిమా ప్రెజర్ పడటం వల్ల ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో మా కో-డైరెక్టర్ దగ్గరికి వచ్చి ఆయన తప్పు ఏమాత్రం లేకుండా మీకు అసలు పద్ధతి ప్లాన్ లేదు ఒక రాక్షసుడు మాదిరి పనిచేస్తున్నాను ఇండస్ట్రీలో అందరు సీనియర్ లే కానీ ఎవరికి బుర్ర లేదా అంటూ గట్టిగా అరిచారు. అయితే అందులో మా కో-డైరెక్టర్ తప్పు ఏమాత్రం లేదు.

అయితే ఈ విషయంలో ఉదయ్ కిరణ్ తప్పు కూడా ఏమాత్రం లేదు ఆయన వేరే సినిమా ప్రజర్ లో ఇతనిపై అరిచారు. అతనికి ఎన్ని టెన్షన్లు ఉన్నా కానీ నా డిపార్ట్మెంట్ లో ఉన్న వారిపై అలా అనేసరికి ఎంతో కోపం వచ్చింది. ఆయన రేపు పొద్దున ఒక డైరెక్టర్ అయ్యేవారు అతనిని అలా అనేసరికి ఆ సమయంలో ఏమి మాట్లాడకుండా జస్ట్ ప్యాకప్ అని చెప్పేసి ఎవరితోనూ మాట్లాడకుండా అన్నపూర్ణ స్టూడియో నుంచి నడుచుకుంటూ వెళ్లి పోయానని ఆదిత్య వెల్లడించారు.

ఆ క్షణంలో మా కెమెరామెన్, డ్రైవర్లు అందరూ నా కోసం వెతుకుతూ కార్లు వేసుకొని వచ్చారని విఎన్ ఆదిత్య ఈ సందర్భంగా అప్పట్లో జరిగిన ఈ విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు తనతో ఎంతో సన్నిహితంగా ఉండేవాడని అతను చనిపోయే ముందు రోజు రాత్రి కూడా తనతో గంటల తరబడి ఫోన్లో మాట్లాడారని ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ గురించి గుర్తు చేసుకుని డైరెక్టర్ వి.యన్.ఆదిత్య ఎమోషన్ అయ్యారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago