Udhay kiran : ఇండస్ట్రీ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా చిన్న వయసులో ఎదిగి అంతే త్వరగా ఆ స్టార్డమ్ ను కోల్పోయి చివరికి జీవితం చాలించి ఆత్మహత్య చేసుకుని మరణించి అందరినీ ఆశ్చర్యంలో అలాగే బాధలో వదిలేసి వెళ్ళిపోయాడు ఉదయ్ కిరణ్. మెగాస్టార్ చిరు అల్లుడు కావాల్సిన వాడు చివరికి సినిమాలు లేక డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజానికి ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చిన ఉదయ్ కిరణ్ ను అల్లుడిని చేసుకోవాలని చిరు అనుకున్నాడు, ఎంగేజ్మెంట్ కూడా జరిగాక ఎందుకు క్యాన్సిల్ అయిందో ఎవరికీ పెద్దగా కారణాలు తెలియకపోయినా పుకార్లు మాత్రం బాగా వచ్చాయి.
అందుకే క్యాన్సిల్ అయింది.. పవన్ తుపాకీ తో బెదిరించాడా.?
చిరంజీవి తన పెద్ద కూతురు సుస్మిత కు ఉదయ్ కిరణ్ ను ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. నిజానికి ఉదయ్ కిరణ్ కి చిరు అంటే చాలా ఇష్టం, తన అభిమాన హీరోకి అల్లుడు అవ్వడం.. ఇంక అంతకన్నా ఇంకేం కావాలి అనుకున్నాడు. కానీ ఉదయ్ కిరణ్ టాప్ హీరో అప్పట్లో అయినా కూడా చిరు రేంజ్ కాదు, తన కూతురుని ఒక మంచి స్టేటస్ ఉన్న ఇంటికి ఇచ్చి పెళ్లి చేయాలని ఎవరైనా భావిస్తారు అలానే చిరు కూడా అలోచించి ఉదయ్ తో పెళ్లి వద్దని అనుకున్నారు అంతకు మించి వేరే కారణాలు లేవు.
ఇక ఉదయ్ కిరణ్ ను పవన్ గన్ తో బెదిరించాడు అన్నది కూడా ఒట్టి పూకరే అంటూ సీనియర్ జర్నలిస్ట్ ఒకరు ఇటీవలే ఒక ఇంటర్వ్యూ తెలిపారు. వాళ్ళ మధ్య గొడవలేమి జరగలేదు మరి పవన్ ఎందుకు గన్ తో బెదిరిస్తాడు. ఇక ఉదయ్ కిరణ్ కెరీర్ నాశనం అవడానికి చిరు కారణం కాదు, అంటూ చెప్పారు సీనియర్ జర్నలిస్ట్. కానీ చిరు వల్లే ఉదయ్ కిరణ్ కెరీర్ పోయింది ఆ డిప్రెషన్ లోనే చనిపోయాడు అంటూ పుకార్లు మాత్రం పోలేదు. నిజానిజాలు ఏవైనా ఉదయ్ కిరణ్ మరణం మాత్రం ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…