Featured

Uma Maheswari : ఉమా మహేశ్వరి గారు ఏం వ్యాపారం చేసేవారో తెలుసా…. కూతురి పెళ్లి తరువాత ఏం జరిగింది..!

Uma Maheswari : ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమా మహేశ్వరీ సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. బుధవారం నాడు ఆమె అంత్యక్రియలు నందమూరి కుటుంబ సభ్యులు జరిపించారు. నందమూరి కుటుంబ సభ్యులు బాధ నుండి తేరుకొకముందే అసలు ఎందుకు ఆమె ఆత్మహత్య చేసుకున్నారు, కారణాలమిటి అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇంతవరకు బయట పబ్లిక్ కు అంతగా తెలియని ఉమా మహేశ్వరి గారి గురించి ఇపుడు అందరూ తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు.

అందరిలా ఉమా జీవితం ఆనందంగా లేదు…

ఎన్టీఆర్ గారికి ఎనిమిది మంది మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలు అయితే ఆడ పిల్లల్లో ఉమా గారు కాకుండా మిగిలిన ముగ్గురు బాగా స్థిరపడ్డారు. ఎన్టీఆర్ గారి సంతానం అందరిలోనూ చిన్న వారైనా ఉమా మహేశ్వరీ అంటే ఇంట్లో అందరికి ఇష్టం. ఆమెను చాలా ప్రేమతో చూసుకునే వారట. ఇక ఎన్టీఆర్ గారికి చిన్న కూతురంటే చాలా ఇష్టమంట. ఇక ఆయన ఉన్నన్ని రోజులు ఆయన వృత్తి పరమైన మీటింగులు, ఆపాయింట్మెంట్స్ అన్ని తానే చూసుకునేదట. ఎన్టీఆర్ గారు ఉదయం రెండు గంటలకే లేస్తే అదే సమయానికి ఉమా గారు లేచి ఆయన ఆరోజు ఎవర్ని కాలవలో ఏం పనులు ఉన్నాయో మొత్తం షెడ్యూల్ చూసుకునేదట. ఇక ఉమా కోసం కొన్న ఇంట్లోనే పెద్దాయన చనిపోయే వరకూ ఉన్నారు. ఇక ఉమా గారి మొదటి భర్త వల్ల చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. మానసికంగా, శారీరకంగా ఆమెను చాలా బాధ పెట్టారట. ఇక రెండో పెళ్లి తరువాత ఉమా గారి జీవితం ప్రశాంతంగా ఉంది. ఇక ఉమా మహేశ్వరి వ్యాపారం లోనూ అడుగుపెట్టారు.

బేకరీ కి సంబంధించిన వ్యాపారం చేస్తున్న ఆమె ఇటీవలే చిన్న కూతురు దీక్షిత వివాహం జరిగి ఇంటినుండి అత్తారింటికి వెళ్లిపోవడంతో ఒంటరి అయిపోయింది. అప్పటికే అనారోగ్య సమస్యల కారణంగా మందులు వాడుతున్న ఆమెను ఒంటరి తనం బాగా బాధించింది. భర్త వ్యాపారం నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్తుండడం వల్ల ఒంటరిగా ఉన్న ఉమా గారు మరింత డిప్రెషన్ కి లోనయ్యారు. బేకరీ వ్యాపారం కూడా పట్టించుకోవడం మానేశారు. డిప్రెషన్ వల్ల గదిలో ఎక్కువ సమయం ఒంటరిగా ఉండటం వంటివి చేస్తూ చివరకు ఆత్మహత్య చేసుకున్నారు. ఏది ఏమైనా అందరూ ఉన్నా ఒంటరిగా అయిపోయి చివరకు జీవితం నుండి రాజీనామా తీసుకున్నారు.

Bhargavi

Recent Posts

చిల్లర నాణాలతో చరిత్ర సృష్టించిన రైతు.. ద్వారకా తిరుమలకి కానుక!

తూర్పు గోదావరి జిల్లాలో ఓ సాధారణ రైతు తన అచంచల భక్తితో అసాధారణ సృష్టికి రూపమిచ్చాడు. నిత్యజీవితంలో వ్యవసాయం చేస్తూ…

7 hours ago

నమస్కారం ఎందుకు చేస్తారు? ఎవరికి ఎలా చేయాలో తెలుసా? ఆశ్చర్యపోయే నిజాలు!

భారతీయ సంస్కృతిలో పలకరింపు అంటే కేవలం మాటల మార్పిడి కాదు.. అది మన విలువలు, వినయం, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించే…

7 hours ago

బట్టలు లేకుండా స్నానం… సంప్రదాయం ఏమంటోంది? నిజం ఏంటి?

ప్రతిరోజూ ఉదయం లేవగానే స్నానం చేయడం మన దైనందిన జీవితంలో భాగమే. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, మనసుకు తేలికగా…

7 hours ago

భర్త దీర్ఘాయుష్షు కోసం మహిళలు తప్పక చేయాల్సిన వ్రతం ఏది?

వైవాహిక జీవితంలో ఆనందం, ఆయుష్షు, ఐశ్వర్యం కోరుకునే మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతాలలో వట సావిత్రి వ్రతం ఒకటి. సావిత్రి…

7 hours ago

ఖాళీ కడుపుతో నేరేడు తింటే ఏమవుతుందో తెలుసా?

వేసవి కాలం రాగానే మార్కెట్లలో కనిపించే నల్లటి నేరేడు పండ్లు చాలా మందిని ఆకర్షిస్తాయి. రుచికరంగా ఉండే ఈ పండు…

8 hours ago

సతీదేవి శరీరాన్ని విష్ణువు ఎందుకు ఖండించాడు? ఆశ్చర్యకర గాథ!

హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి…

10 hours ago