Archana: ‘తపన’ అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ‘నేను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, సామాన్యుడు’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అర్చన ఆ తరువాత తెలుగులో సరైన అవకాశాలను అందుకోలేదు. దీనికి తోడు వచ్చిన మంచి అవకాశాలను వదులుకోవడం వల్ల కెరీర్ సవ్యంగా లేదు. ఇక మలయాళం, కన్నడ, తమిళం లో కూడా మంచి సినిమాలను చేసిన అర్చన, బిగ్ బాస్ మొదటి సీజన్ ద్వారా ప్రేక్షకులకు మళ్ళీ చేరువయింది. ఇటీవలే పెళ్లి చేసుకుని మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న ఆర్చన ఇండస్ట్రీ లో ఉన్న పరిస్థితుల గురించి పలు ఇంటర్వ్యూ ల్లో స్పందించారు.
పెళ్లయిందని రెమ్యూనరేషన్ అవసరమా అన్నారు…
మేల్ సెంట్రిక్ సమాజంలో ఉన్నామని అర్చన అభిప్రాయపడ్డారు. ఇటీవల ఒక నిర్మాత సినిమా ఆఫర్స్ ఇస్తూ పెళ్లయింది కదా రెమ్యూనరేషన్ తగ్గించు అన్నాడు. అదే నిర్మాత హీరోలకు పెళ్ళై, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అని రెమ్యూనరేషన్ తగ్గించగలరా అంటూ కామెంట్స్ చేసింది. సినిమాల్లో హీరోలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. బాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలు వస్తున్నా హీరోయిన్లకు ప్రాధాన్యత లేకపోతే విమర్శిస్తారు. కానీ ఇక్కడ హీరోయిన్లకు ప్రధాన్యత ఉండదు. ఇప్పుడిప్పుడే సినిమాల ధోరణి మారుతోంది.
హీరోయిన్లకు కూడామంచి పాత్రలు వస్తున్నాయి అంటూ చెప్పింది. కెరీర్ మొదట్లో సరిగా ఆలోచించకోకుండా కొన్ని పాత్రలు చేసానని, కొంత మెచ్యూరిటీ వచ్చాక సరైన పాత్రలు ఎంచుకున్నట్లు తెలిపింది. ఇక మలయాళం లో చేసేటపుడు ఆ సినిమాలో హీరో మెసేజ్ లు పెట్టడంతో భరించలేక ఆ సినిమా నుండి తప్పుకున్నట్లు చెప్పింది. ఇలాంటి ఘటనలు జరిగినపుడు మా అమ్మ, నాన్న నాకు అండగా నిలబడ్డారని వాళ్ళే నా బలం అంటూ చెప్పారు అర్చన.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…