Prabhas – Kriti Sanon: ప్రభాస్ కృతి సనన్ రిలేషన్ లో ఉన్నారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఈ వార్తలకు అనుగుణంగానే కృతి సనన్ వ్యవహార శైలి కూడా ఉండడంతో ఈమె ప్రభాస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. దీనికి తోడు వరుణ్ ధావన్ చేసిన కామెంట్స్ ఇందుకు మరింత బలాన్ని చేకూర్చాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఈయన వయసు 42 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా పెళ్లి గురించి ఏమాత్రం ప్రకటించకపోవడంతో తరచూ ఈయన పెళ్లికి సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.
ఈ క్రమంలోనే కృతి సనన్ తోకలిసి రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సందు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అతి త్వరలోనే కృతి సనన్, ప్రభాస్ నిశ్చితార్థం జరగబోతుంది అంటూ చెప్పుకొచ్చారు.
prabhas: రిలేషన్ లో ఉన్న ప్రభాస్ కృతి సనన్…
ఆది పురుష్ సినిమా షూటింగ్ సమయంలోనే ఈయన తన మనసులో ఉన్న మాటను నటి కృతి సనన్ కి చెప్పగా ఆమె కూడా తన ప్రపోజలను యాక్సెప్ట్ చేసిందని త్వరలోనే వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకోబోతున్నారంటూ ఈయన చెప్పడంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయాలు విన్నటువంటి ప్రభాస్ అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి గురైన తమ అభిమాన హీరో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…