General News

బంగారం, నగదు, బుల్లెట్ బండి ఇచ్చినా.. వేధింపులు తట్టుకోలేక.. 6 నెలలకే సాఫ్ట్‌వేర్ మహిళ మృతి!

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌ వద్ద తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం చెందింది. ఆత్మహత్యకు ముందు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్న ఆమె బ్రిడ్జ్‌పై నుంచి దూకి బలవన్మరణం చేసుకుంది.

Unable to bear the harassment, a software woman died after just 6 months!

వివరాల్లోకి వెళితే…
ఈస్ట్‌మారేడ్‌పల్లికి చెందిన సుష్మ (27) అనే యువతికి నేరేడ్‌మెట్‌కు చెందిన గొల్లూరు అమృత్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో ఈ ఏడాది జనవరి 31న వివాహం జరిగింది. ఇద్దరూ ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. పెళ్లిలో సుష్మ తల్లిదండ్రులు రూ. 5 లక్షల నగదు, 6 తులాల బంగారం, అలాగే రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ కట్నంగా ఇచ్చారు.

కానీ పెళ్లి తర్వాత కొద్ది రోజులు గడవకముందే అత్తగారి ఇంటి నుంచి అదనపు కట్నం డిమాండ్‌లు మొదలయ్యాయి. అత్త, మామ, భర్త, మరిది అందరూ కలిసి సుష్మను మాటలతో వేధించేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ వేధింపులు కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించి జూన్ 13న హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది. అనంతరం జూన్ 16న డిశ్చార్జ్ చేసి పుట్టింటికి తీసుకెళ్లారు.

జూన్ 17న, సుష్మ తన ల్యాప్‌టాప్ తీసుకురావడానికి తండ్రితో కలిసి మళ్లీ అత్తింటికి వెళ్లింది. అప్పుడు కూడా అత్తింటివారు ఆమెను, తండ్రిని తీవ్రంగా దూషించారట. దీనితో తీవ్ర మనోవేదనకు గురైన సుష్మ అదే రోజు ఆఫీసుకు వెళ్లిన తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. దీనిపై ఆమె తండ్రి ఆఫీసుకి ఫోన్ చేసి అడగగా.. ఆమె 8:30 ప్రాంతంలో వెళ్ళిపోయినట్టు కంపెనీ చెప్పగా, ఆపై తండ్రి మాదాపూర్ పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు చేశాడు.

జూన్ 18 ఉదయం, దుర్గం చెరువులో ఒక మహిళ మృతదేహం కనిపించగా, అది సుష్మదిగా గుర్తించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. సుష్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భర్త, అత్త, మామ, మరిదిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనతో నగరంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఐటీ రంగంలో స్థిరపడిన, చదువుకున్న మహిళలు కూడా ఈ తరహా మానసిక వేధింపులకు బలవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. పోలీసులకూ, సమాజానికీ ఇది మరో జాగ్రత్త ఉచ్చకం.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago