General News

పెళ్లైన 50 రోజుల్లోనే భర్తకు లస్సీలో మత్తు మందు.. నగలుతీసుకుని ప్రియుడితో పరార్!

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఓ యువతి ప్రేమ కోసం తన భర్త, అత్తింటి కుటుంబాన్ని మోసం చేసి పరారైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పెళ్లై నెలన్నర మాత్రమే అయినా.. లక్షల విలువైన నగలు, నగదు తీసుకొని తన ప్రియుడితో కలిసి తలదాచుకుందట. అంతకుముందు ఆ కుటుంబంలో ప్రేమగా మెలిగి, విశ్వాసం పొందిన ఆమె.. అర్థరాత్రి లస్సీలో మత్తు మందు కలిపి అందరికీ ఇచ్చిందని పోలీసులు తెలిపారు.

Woman Went Off With Her Boyfriend 50 days of wedding

పూర్తి వివరాల్లోకి వెళితే…
హాపూర్ జిల్లా సిటీ కొత్వాలి ప్రాంతంలోని సారవా గ్రామానికి చెందిన సల్మాన్ అనే వడ్రంగి, లోనీ ప్రాంతానికి చెందిన సనా అనే యువతిని ఏప్రిల్ 25న వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత సనా, భర్తతోపాటు అత్తమామలతో ప్రేమగా మెలిగింది. అత్తింటివారు ఆమె నడవడికతో సంతృప్తిగా ఉండిపోయారు. కానీ, ఇదంతా బహుశా నాటకమే. ఎందుకంటే పెళ్లికి ముందే సనాకు ఘజియాబాద్‌కు చెందిన సోహైల్ అనే యువకుడితో ప్రేమ సంబంధం ఉండేది. పెళ్లైన తర్వాత కూడా వాళ్లు ఫోన్లో మాట్లాడుతూనే ఉండేవారు.

మే 13 రాత్రి, సనా ప్రేమగా తన భర్త, మిగిలిన కుటుంబ సభ్యులకు పెరుగు లస్సీ అందించింది. తాగిన కొద్ది సేపట్లోనే వారు అందరూ స్పృహతప్పి పడిపోగా, ఇంట్లో ఉన్న రూ.50 వేల నగదు, లక్షల విలువైన బంగారు ఆభరణాలు తీసుకొని సనా తన ప్రియుడితో కలిసి బైక్ పై పారిపోయింది. తెల్లారేసరికి భార్య కనిపించకపోవడంతో సల్మాన్ చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసుల దర్యాప్తు అనంతరం సీసీటీవీ ఫుటేజ్‌లో రాత్రి 12.30 గంటల సమయంలో ఓ యువకుడితో బైక్ పై వెళ్లిపోయిన దృశ్యం కనిపించింది. మత్తు మందు కలిపిన లస్సీ వల్లే కుటుంబ సభ్యులు స్పృహ తప్పారని పోలీసులు నిర్ధారించారు. సనా కుటుంబ సభ్యులను ప్రశ్నించగా కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదట.

అంతేకాకుండా, దర్యాప్తులో సోహైల్ అనే వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది. అతను ఘజియాబాద్‌లో ఏసీ రిపేరింగ్ వర్కర్. ఇద్దరినీ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ ఇచ్చినా సనా తాను తన ప్రేమికుడితోనే ఉండాలని తేల్చి చెప్పింది. భర్త వద్దకు తిరిగి వెళ్లేందుకు ఆమె నిరాకరించడంతో, పోలీసులు సనాను ఆమె బంధువులకు అప్పగించారు.

ఈ సంఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పెళ్లి అనేది విశ్వాసంతో నడిచే బంధం అని భావించే సమాజంలో, ఇలాంటి మోసాలు పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు మిగిలిన న్యాయపరమైన చర్యలు కొనసాగిస్తున్నారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago