Movie News

యుగానికి ఒక్కడు సినిమా గురించి అసలు సీక్రెట్ బయటపెట్టిన దర్శకుడు!

సాధారణంగా ఒక సినిమా తెరకెక్కించాలంటే సినిమా కథాంశాన్ని బట్టి ఆ సినిమాకు బడ్జెట్ నిర్ణయిస్తారు.ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చాలా మంది దర్శక నిర్మాతలు అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ప్రమోషన్ చేస్తారు. అయితే నిజానికి తక్కువ ఖర్చుతో సినిమాను తెరకెక్కించినప్పటికీ, సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి దర్శక నిర్మాతలు ఈ విధంగా చెప్పడం సర్వసాధారణమే. అయితే ఇలా చెప్పడం సినిమాకు పూర్తిస్థాయిలో నష్టం వాటిల్లుతుందని తాజాగా యుగానికి ఒక్కడు సినిమా డైరెక్టర్ సెల్వ రాఘవన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

11 సంవత్సరాల క్రితం హీరో కార్తీక్ ప్రధాన పాత్రలో నటించిన యుగానికి ఒక్కడు సినిమాకు దర్శకత్వం వహించారు. ఇదే సినిమా తమిళంలో  ‘ఆయిరత్తిల్ ఒరువన్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ తమిళంలో మాత్రం యావరేజ్ లిస్టులో చేరిపోయింది. ఈ సినిమా విడుదలై పదకొండు సంవత్సరాలు అయిన తర్వాత ఈ సినిమా గురించి దర్శకుడు ఓ పెద్ద సీక్రెట్ చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ 2010వ సంవత్సరంలో తెరకెక్కిన యుగానికి ఒక్కడు అనే సినిమా అప్పట్లో పద్దెనిమిది కోట్ల రూపాయలతో పూర్తి చేశాం. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచటం కోసం ఈ సినిమా 32 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ చిత్రమని ప్రచారం చేసాము.

ఈ విధంగా 32 కోట్లు అని ప్రచారం చేయడమే పొరపాటైంది. నిజానికి ఈ సినిమాకు అయిన ఒరిజినల్
డబ్బులను ఈ సినిమా రాబట్టింది. అయితే 32 కోట్లు అని ప్రచారం చేయడంతో అంత కలెక్షన్లను సాధించలేక ఈ సినిమా యావరేజ్ లిస్ట్ లోకి చేరిపోయిందంటూ అసలు విషయాన్ని దర్శకుడు సెల్వరాఘవన్ తెలియజేశారు. ఈ సినిమా వచ్చిన 11 సంవత్సరాల తర్వాత సెల్వరాఘవన్ ఈ చిత్రానికి సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కథానాయకుడిగా ధనుష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago