Unstoppable: ఉన్న ప్రేమ ఓట్లుగా ఎందుకు మారలేదు….పవన్ కి బాలయ్య సూటి ప్రశ్న!

Unstoppable: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న బాలకృష్ణ ఆహాలో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ షోలో కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బాలకృష్ణ హోస్టుగా వ్యవహరించిన అన్ స్థాపబుల్ సీజన్ వన్ మంచి హిట్ అవటంతో ఇటీవల అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ప్రారంభించారు.

ఈ అన్ స్టాపబుల్ సీజన్ టు మొదలైనప్పటినుండి ఇప్పటివరకు మంచి రేటింగ్స్ సొంతం చేసుకుంటుంది. ఈ రెండవ సీజన్లో మొదటి ఎపిసోడ్ లో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అతని తనయుడు అతిథిగా హాజరయ్యారు. ఇక ఆ తర్వాత ఎంతోమంది సీనియర్ హీరోయిన్లు, యంగ్ హీరోలు ఈ షోలో పాల్గొని బాలకృష్ణ తో కలిసి సందడి చేశారు. ఇక ఇటీవల ప్రభాస్ కూడా ఈ షోలో పాల్గొని సందడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇక ఈ షోలో మరొక స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యింది.ఆ షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి ఇద్దరు లెజెండరీ హీరోలను ఒకే వేదికపై చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Unstoppable: రాజకీయాల పై ప్రశ్నించిన బాలయ్య..


ఈ క్రమంలో తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఆహా విడుదల చేసింది.ఈ ప్రోమో లో బాలయ్య పవన్ కళ్యాణ్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలకు సంబంధించిన చర్చ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఎపిసోడ్ లో బాలయ్య పవన్ కళ్యాణ్ ని కొన్ని క్లిష్టమైన ప్రశ్నలు అడిగాడు. అయితే పవన్ కళ్యాణ్ వాటికి సమాధానం చెబుతున్న సమయంలో వీడియో మ్యూట్ చేసి ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెంచారు. పవన్ కళ్యాణ్ గెస్ట్ గా హాజరైన ఎపిసోడ్ ఫిబ్రవరిలో ప్రసారం కానుంది. తాజాగా విడుదల చేసిన ప్రోమో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.