Categories: FeaturedMovie News

Rakul Preeth Singh: ఆ పని కోసం కారులోనే డ్రెస్సులు మార్చుకున్న స్టార్ హీరోయిన్ అంత అవసరం ఏమొచ్చిందబ్బా?

Rakul Preeth Singh: వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సందీప్ కిషన్ తో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా మంచి హిట్ అవ్వటంతో టాలీవుడ్ లో ఆమెకు మంచి మంచి అవకాశాలు దక్కాయి. ఈ క్రమంలో తెలుగు తమిళ్ భాషలలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకొని హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.

రకుల్ నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీంతో హిట్, ప్లాఫ్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటున్న రకుల్ ప్రీత్ కి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలు లభించాయి. బాలీవుడ్ లో మంచి మంచి అవకాశాలు రావడంతో ఈ అమ్మడు ముంబైకి తన మఖాం మార్చేసింది. దీంతో తెలుగు సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది.

ఇక ఇటీవల హిందీలో రకుల్ నటించిన “ఛత్రీవాలి” సినిమా ఓటీటీలో విడుదల అయింది. ఈ సినిమాలో రకుల్ సురక్షితమైన శృంగారానికి సంబంధించిన పాఠాలు చెప్పే కెమిస్ట్రీ టీచర్ గా నటించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ఈ సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలో రకుల్ మాట్లాడుతూ. శృంగారం గురించి బహిర్గతంగా మాట్లాడటానికి ఎవరు ఇష్టపడరు. కానీ ప్రస్తుత కాలంలో పిల్లలకు ఈ విషయం గురించి అవగాహన కల్పించడానికి ఈ సినిమా ఎంతో ఉపయోగపడుతుందని భావించి ఈ సినిమాలో నటించినట్లు రకుల్ వెల్లడించింది.

ఇక ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవడం కోసం తాను పడిన కష్టాల గురించి కూడా రకుల్ వెల్లడించింది. ఈ క్రమంలో రకుల్ ప్రీత్ మాట్లాడుతూ..” నేను కాండీవాలిలో ఉండేదాన్ని. కానీ సినిమా అవకాశాల కోసం నా ట్రైనర్ తో కలిసి ఒక కేఫ్ లో కూర్చొని సినిమాలో అవకాశాలు పొందటానికి ఎక్కడికి వెళ్లాలి? ఆడిషన్ ఎలా ఇవ్వాలి ? అన్న విషయాల గురించి చర్చించుకునేదాన్ని. ఆ సమయంలో బ్యాగులో బట్టలు పెట్టుకుని తిరుగుతూ ఎక్కడికైనా ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు కారులోనే బట్టలు మార్చుకొని ఆడిషన్స్ కి వెళ్లేదాన్ని.

Rakul Preeth Singh: ఆత్మవిశ్వాసంతో అడుగులు వేశాను…

కొన్ని ఆడిషన్స్ లో నన్ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసి షూటింగ్ ప్రారంభమైన తర్వాత కూడా నన్ను రిజెక్ట్ చేసి వేరొక హీరోయిన్ ని తీసుకునేవారు. ఇలా ప్రతిసారి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారి పోయేది. అయితే కష్టపడకుండా అన్ని దక్కాలని కోరుకునే మనస్తత్వం నాకు లేదు. ఏ పనిలో అయిన విజయంసాధించాలంటే కష్టపడాల్సిందే. అందుకే పోరాటం అనే పదం నాకు నచ్చదు. ఇలా ప్రతిసారి అవకాశాలు వచ్చి చేజారి పోయినా కూడా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేశాను. అలా చేయడం వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను” అంటూ తన ఎక్స్పీరియన్స్ గురించి రకుల్ చెప్పుకొచ్చింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago