Movie News

Kamal Kamaraju: పోలిసులకు అడ్డంగా దొరికిపోయిన టాలివుడ్ నటుడు కమల్ కామరాజు.. వైరల్ అవుతున్న పోస్ట్..!

Kamal Kamaraju: ఆవకాయ బిర్యాని సినిమాలో హీరోగా నటించిన కమల్ కామరాజు అందరికీ సుపరిచితమైన వ్యక్తి. ఆవకాయ బిర్యాని సినిమాలో హీరోగా నటించిన కమల్ కామరాజు ఆ తర్వాత చత్రపతి, గోదావరి కాటమరాయుడు వంటి సినిమాలలో కీలక పాత్రలలో నటించి మంచి గుర్తింపు పొందాడు. ఇదిలా ఉండగా ఇటీవల కమల్ కామరాజు చేసిన పని వల్ల పోలిసులకు అడ్డంగా దొరికిపోయాడు.

సాధారణంగా పోలీసులకు సామాన్య ప్రజలు సెలబ్రిటీలు అనే వ్యత్యాసం ఉండదు తప్పు చేస్తే వారు ఎవరైనా శిక్షిస్తారు. ఇప్పటికే ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తూ పోలీసులకు చిక్కి వార్తల్లో నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల నటుడు కమల్ కామరాజు కూడా చట్ట వ్యతిరేకమైన పనిచేసి పోలీసులకు దొరికిపోయాడు. అయితే తాను పోలీసులకు దొరికిపోయిన విషయాన్ని కామరాజు స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తాజాగా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.

తాజాగా కమల్ కామరాజు ట్వీట్ చేస్తూ…అందరికీ చెప్తాను. ఇవాళ ఉదయమే బైక్ మీద వెళుతూ 60లో వెళ్లాల్సిన నేను రోడ్డు ఖాళీగా ఉందని ఆత్రుత ఆపుకోలేక 80లో వెళ్లాను. ఇలా ఉదయమే నా బైక్ స్పీడు పెంచి పోలిసులకు దొరికిపోయాను. ఇంత ఉదయమే నేను స్పీడుగా వెళ్తున్నా కూడా పోలీసులు పట్టుకుని నాకు చలాన్‌ పంపినందుకు హైదరాబాద్‌ పోలీసులకు ధన్య వాదాలు అంటూ ట్వీట్ చేశాడు.

Kamal Kamaraju: చలనా వేసిన ట్రాఫిక్ పోలీసులు..

ఈ మేరకు రోడ్డు మీద స్పీడుగా వెళ్తున్న తన బైక్ ఫొటోను కూడా పోస్టు చేశాడు. మొత్తానికి చట్ట నియమాలను అతిక్రమించి అతివేగంగా వెళ్ళటం వల్ల ఇలా పోలీసులకు చిక్కి చలానా కట్టాడు. ఈయనే కాకుండా ఎంతోమంది సెలబ్రిటీలు ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పోలీసులకు చిక్కి జరిమానా కట్టడమే కాకుండా అరెస్టు కూడా అయ్యారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago