Kamal Kamaraju: ఆవకాయ బిర్యాని సినిమాలో హీరోగా నటించిన కమల్ కామరాజు అందరికీ సుపరిచితమైన వ్యక్తి. ఆవకాయ బిర్యాని సినిమాలో హీరోగా నటించిన కమల్ కామరాజు ఆ తర్వాత చత్రపతి, గోదావరి కాటమరాయుడు వంటి సినిమాలలో కీలక పాత్రలలో నటించి మంచి గుర్తింపు పొందాడు. ఇదిలా ఉండగా ఇటీవల కమల్ కామరాజు చేసిన పని వల్ల పోలిసులకు అడ్డంగా దొరికిపోయాడు.

సాధారణంగా పోలీసులకు సామాన్య ప్రజలు సెలబ్రిటీలు అనే వ్యత్యాసం ఉండదు తప్పు చేస్తే వారు ఎవరైనా శిక్షిస్తారు. ఇప్పటికే ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తూ పోలీసులకు చిక్కి వార్తల్లో నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల నటుడు కమల్ కామరాజు కూడా చట్ట వ్యతిరేకమైన పనిచేసి పోలీసులకు దొరికిపోయాడు. అయితే తాను పోలీసులకు దొరికిపోయిన విషయాన్ని కామరాజు స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తాజాగా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.
తాజాగా కమల్ కామరాజు ట్వీట్ చేస్తూ…అందరికీ చెప్తాను. ఇవాళ ఉదయమే బైక్ మీద వెళుతూ 60లో వెళ్లాల్సిన నేను రోడ్డు ఖాళీగా ఉందని ఆత్రుత ఆపుకోలేక 80లో వెళ్లాను. ఇలా ఉదయమే నా బైక్ స్పీడు పెంచి పోలిసులకు దొరికిపోయాను. ఇంత ఉదయమే నేను స్పీడుగా వెళ్తున్నా కూడా పోలీసులు పట్టుకుని నాకు చలాన్ పంపినందుకు హైదరాబాద్ పోలీసులకు ధన్య వాదాలు అంటూ ట్వీట్ చేశాడు.

Kamal Kamaraju: చలనా వేసిన ట్రాఫిక్ పోలీసులు..
ఈ మేరకు రోడ్డు మీద స్పీడుగా వెళ్తున్న తన బైక్ ఫొటోను కూడా పోస్టు చేశాడు. మొత్తానికి చట్ట నియమాలను అతిక్రమించి అతివేగంగా వెళ్ళటం వల్ల ఇలా పోలీసులకు చిక్కి చలానా కట్టాడు. ఈయనే కాకుండా ఎంతోమంది సెలబ్రిటీలు ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పోలీసులకు చిక్కి జరిమానా కట్టడమే కాకుండా అరెస్టు కూడా అయ్యారు.






























