Arundhathi: అరుంధతిలో అనుష్క చేయాల్సింది కాదట..! హిట్ సినిమాకు చేజార్చుకున్న బ్యూటీ..!
Arundhathi: ‘అరుంధతి’ తెలుగు సినిమా చరిత్రలో సంచలనం. ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా టాప్ హీరోలకు ధీటుగా వసూళ్లను రాబట్టింది. ఓవర్ నైట్ లో అనుష్కను స్టార్ ను చేసింది. సీనియర్ దర్శకుడు కోడి రామక్రిష్ణ డైరెక్షన్ వచ్చిన ఈ సినిమా భారీ హిట్ కొట్టింది.
ఇప్పటికీ ఇందులోని జేజమ్మ.. క్యారెక్టర్ ని ఎవరూ మరిచిపోలేదు అంతలా తెలుగు ప్రేక్షకుల్లోకి వెళ్లింది. తమిళంలో కూడా డబ్ అయిన ఈసినిమా అక్కడా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఆతరువాత పలు భాషల్లో రిమేక్ అయింది.
2009 సంక్రాంతి బరిలో నిలిచిన ఈసినిమా భారీ విజయాన్ని, కలెక్షన్లను దక్కించుకుంది. మల్లెమాల ఎంంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శ్యామ్‌ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా రిలీజై నేటికి పదమూడేళ్లు పూర్తైంది. 2009 జనవరి 16న విడుదలైంది అరుంధతి సినిమాకు 13 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పటికీ టీవీల్లో అరుంధతి వస్తుందంటే ప్రేక్షకులు టీవీలకే అతుక్కుపోతున్నారంటే.. సినిమా ఏ రేంజ్ హిట్ సాధించిందో మనకు అర్థం అవుతుంది.
దీంతో పాటు కోటి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, జేజమ్మ సాంగ్స్ ఇప్పటికీ ఆల్ టైం హిట్స్. ఇక విలన్ గా సోనూసూద్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ‘అమ్మా.. బొమ్మాళీ’ అనే డైలాగ్ ఇప్పటికీ ఫేమస్ గా నిలిచిపోయింది. అనుష్కతో పాటు షియాజి షిండే, సోనూసూద్ లకు ఎనలేని గుర్తింపు తీసుకువచ్చింది అరుంధతి. అయితే మందుగా అరుంధతి సినిమాలో హీరోయిన్ గా మలయాళ కుట్టి మమతా మోహన్‌దాస్‌ను అరుంధతి సినిమా కోసం సంప్రదించారట. కానీ అప్పుడే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమెకు ఎలాంటి కథలు ఎంచుకోవాలో పెద్దగా తెలిసేది కాదని, దానివల్లే అరుంధతిని వదులుకున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీంతో అరుంధతి క్యారెక్టర్ అనుష్కను చేరింది. ఆ సమయంలో మమతా మోహన్ దాస్ బిజీగా ఉండటం కూడా అరుంధతిని వదులుకోవడానికి ఓ కారణంగా తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…