Naveen Polishetty: ఆ ఫొటోలు చూసి బాలీవుడ్ హీరోయిన్లు కుళ్లుకోవాలి.. జాతి రత్నాలు ఫేమ్..
Naveen Polishetty: ‘జాతి రత్నాలు’ సినిమాతో భారీ హిట్ కొట్టాడు నవీన్ పోలిశెట్టి. తనదైన కామెడీతో జాతి రత్నాలు సందడి చేశాడు. బాక్సాఫీస్ వద్ద ఈసినిమా భారీ విజయాన్ని దక్కించుకుంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఈ సినిమాతో హీరోగా తన కెరీర్ను స్టార్ట్ చేశాడు. మొదటి సినిమాతోనే తనేంటో నిరూపించుకున్నాడు. జాత రత్నాలు తర్వాత వరసగా సినిమాలు కమిట్ అవుతున్నాడు.
ఇటీవల ప్రభాస్ నటించిన ‘రాధేశ్యాం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హోస్ట్ గా వ్యవహరించి అందరినీ ఆకట్టుకున్నాడు. కాగా జాతి రత్నాలు విడుదలై దాదాపుగా ఏడాది కావస్తుంది. అప్పటి నుంచి కొత్తగా ఏ సినిమాతో ముందుకు రాలేదు నవీన్ పొలిశెట్టి. హీరో కాకముందు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో కీలక రోల్ లో కనిపించాడు.
చిచ్చోరే సినిమాలో సుశాంత్ రాజ్ పుత్ పక్కన అని ఫ్రెండ్ గా కనిపించాడు. ఆ సినిమాలో కూడా తన నటనతో ప్రేక్షకులకు కామెడీ పంచాడు. తాజాగా తన కొత్త సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ చేశాడు. ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు.
నవీన్ హీరోగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా సంక్రాంతి కానుకగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ లో తనదైన శైలిలో నవ్వులు పూయించాడు నవీన్. తన ఆహర్యం, డైలాగ్ డెలవరీతో అదుర్స్ అనిపిస్తున్నాడు. తన పెళ్లికి సంబంధించి గొప్పలు చెబుతూ.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచబోతున్నాడు. తన పెళ్లికి తీసే ఫొటోలు సోషల్ మీడియాలో అదిరిపోవాలని, కత్రీనా, విక్కీ కౌశల్ కుళ్లుకోవాలని చెప్పడం సరదాగా ఉంటుంది. ‘నేను చెప్పకూడదు కానీ, ఈ డికెడ్లో అలరించే కార్యక్రమం ఇదే. థియేటర్లలో మీరే చూస్తారుగా’ అంటూ వీడియో ముగించారు. తాజాగా ఈ టీజర్ మంచి వ్యూస్ దక్కించుకుంటోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…