Tigers Attack: ఇంటెలిజెంట్ బాతు..ఆ పులలను ఓ ఆట ఆడుకుంది..! వీడియో వైరల్..!
Tigers Attack: ప్రపంచంలో క్రూరమైన జంతువులు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఎక్కువగా సింహం, పులి లాంటి జంతువులకు ఎక్కువగా భయపడుతుంటారు. మిగతా జంతువులు కూడా వీటికే ఎక్కువగా భయపడతాయి. ఇక టైగర్, లయన్స్ లను అడవికి రాజులు అని కూడా అంటుంటారు. అయితే వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతాయి.
అందులో సింహం, పులి లాంటి జంతువులు చిన్న చిన్న జంతువులను వెంటాడుతూ.. వేటాడుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారంది. పులులను అక్కడ ఉన్న ఓ చిన్న బాతు ఆటాడించింది. ఇక చిన్న బాతును పులులు ఏం చాశాయి… దీనికి సంబంధించి వివరంగా తెలుసుకుందాం.
లాస్ వీడియోస్ ఫ్రమ్ మెక్సికో టు ద వరల్డ్ అనే ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్టు చేయపడింది. అందులో ఏముందంటే.. ఓ బాతు కొలనులో అటూ ఇటూ తిరుగతూ ఉంటుంది. దాని చుట్టు మూడు పులులు ఉండి..దానిని పట్టుకునేందుకు ప్రయత్నించాయి.
కానీ.. ఒక పులి వచ్చి పట్టుకునే లోపు నీటిలో మునుగుతూ ఆ పులికి తెలియకుండా..అటూ ఇటు తిరుగుతుంది. మళ్లీ నీటిలో నుంచి బయటకు వచ్చి.. బయటకు చూస్తున్న క్రమంలో మళ్లీ దానిపై ఈ సారి రెండు పులులు దాడి చేస్తాయి. అది మాత్రం వాటికి చిక్కకుండా తప్పించుకుంటూ కనిపిస్తుంది. ఇదంతా ఆ బాతుకు ప్రమాదకరమైనదే అయినప్పటకీ ఈ వీడియో చూస్తుంటే మాత్రం బాతు తప్పించుకునే విధానం మాత్రం అందరినీ అలరించింది. ఒకానొక సమయంలో ఆ డక్ దొరికిపోతుందేమో అనే అనుమానం కలుగుతుంది. కానీ, బాతు అలా చిక్కినట్లే చిక్కి మాయమవుతున్నది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. బాతు ఇంటెలిజెంట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…