General News

Hyderabad: హైదరాబాద్ పేరు మార్చేస్తాం… యోగి ఆదిత్యనాథ్ కు కౌంటర్ ఇచ్చిన అసదుద్దీన్?

Hyderabad: తెలంగాణలో మరొక రెండు రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్లో సందడి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మారుస్తామని దీనిని భాగ్యనగర్ గా పిలుస్తామని తెలిపారు.

ఇక్కడ భాగ్యలక్ష్మి ఆలయం ఉందని ఇది ఎంతో ప్రసిద్ధి చెందిందని అందుకే ఈ హైదరాబాద్ కి భాగ్యనగర్ అనే పేరును పెట్టబోతున్నట్లు ఈయన వెల్లడించారు. అయితే ఈయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు కేంద్ర బిజెపి మంత్రి కిషన్ రెడ్డి కూడా మద్దతు తెలియజేశారు. అసలు ఈ హైదర్ ఎవరు ఈ హైదర్ పేరును మన భాగ్యనగర్ కు ఎందుకు పెట్టుకోవాలి అంటూ మాట్లాడారు. అయితే యోగి ఆదిత్యనాథ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ చీఫ్ అసదుద్దీన్ స్పందిస్తూ యోగి ఆదిత్యనాథ్ కు కౌంటర్ ఇచ్చారు.

హైదరాబాద్ మా అస్తిత్వం…

అసదుద్దీన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ భాగ్యనగర్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో ముందుగా వారిని నేను ప్రశ్నిస్తున్నానని తెలిపారు. పేరు ఎక్కడ రాసి ఉన్నది? మీరు హైదరాబాద్‌ను ద్వేషిస్తారు. అందుకే పేరు మార్చాలని అనుకుంటున్నారు. ఇలాంటి మాటలు విద్వేషానికి ప్రతీకగా నిలుస్తున్నాయని ఈయన తెలియజేశారు.హైదరాబాద్ మా గుర్తింపు, మా అస్తిత్వం. మీరు దీని పేరు ఎలా మారుస్తారు? వాళ్లు కేవలం ద్వేష రాజకీయాలు చేస్తున్నారనీ అసదుద్దీన్ కౌంటర్ ఇచ్చారు అయితే ఇప్పుడు హైదరాబాద్ పేరు మార్చడం పట్ల యోగి వర్సెస్ అసదుద్దీన్ అనేలా మారిపోయిందని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago