Upasana: మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయనున్న మెగా కోడలు..? క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్..?

Upasana: మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే గతంలో కొంతకాలం సినిమాలకు దూరమైన చిరంజీవి రాజకీయాలలో చురుగ్గా పాల్గొని ప్రజారాజ్యం పార్టీని కూడా స్థాపించాడు. అయితే అనూహ్య కారణాలవల్ల ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. ఆ తర్వాత మళ్లీ సినిమాలలో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వరుస సినిమాలలోనటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

ఇక చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్ దసరా కానుకగా ఈరోజు విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిరంజీవి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలో పొలిటికల్ విషయాలను కూడా విలేకరులతో ముచ్చటించాడు.

ఈ సమావేశంలో ఒక విలేకరి మాట్లాడుతూ…మీ వారసురాలిగా మీ కోడలు ఉపాసన రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి మల్కాజిగిరి స్థానంలో ఎంపీగా పోటీచేస్తున్నారన్న విషయం నిజమేనా…? అని ప్రశ్నించగా.. చిరంజీవి స్పందిస్తూ…. ఈ వార్తలలో ఎటువంటి నిజం లేదని కొట్టిపారేశారు. అయినా ఇలాంటి వార్తలను క్రియేట్ చేసేవారు మంచి సినిమాలను తీయొచ్చు అంటూ చెప్పుకొచ్చాడు.

 

Upasana: రాజకీయాలకు దూరంగా ఉపాసన..

ఇకపోతే ఉపాసన ఇలాంటి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటారనే విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఆమె అపోలో హాస్పిటల్ చైర్పర్సన్ గా బాధ్యతలు వ్యవహరించడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఆరోగ్య విషయాలను అభిమానులతో పంచుకుంటూ.. ఎన్నో సామాజిక సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇక ఉపాసన రాజకీయాలలోకి రాబోతుందనే వార్తలు గురించి మెగాస్టార్ క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు చెక్ పడింది.