Upasana: ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాకుండా వ్యాపారవేత్తగా కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా వృత్తిపరమైన జీవితంలో ఎప్పుడు బిజీగా ఉండే ఉపాసన సామాజిక సేవ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు.
ముఖ్యంగా ఈమె గిరిజనుల సంక్షేమానికి ఎంతో పెద్దపీట వేస్తూ ఉంటారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఈమె ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటారనే సంగతి మనకు తెలిసిందే. ఇటీవల ఉపాసన తన కుమార్తె నామకరణ మహోత్సవంలో భాగంగా గిరిజనల సాంప్రదాయ వేడుకలలో తన కుమార్తెకు నామకరణ మహోత్సవాన్ని నిర్వహించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళసై గిరిజనల అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి సంచలనం అయినటువంటి నిర్ణయాల పట్ల ఉపాసన ఎంతో సంతోషం వ్యక్తం చేసి స్వయంగా గవర్నర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాసన తమిళ సైతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
తమిళ సైకి కృతజ్ఞతలు…
ఈ ఫోటోని షేర్ చేసినటువంటి ఉపాసన గిరిజనుల సంక్షేమం కోసం గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు తన మనసుని ఎంతగానో హత్తుకున్నాయని తెలిపారు. ఇలా గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేసినటువంటి గవర్నర్ గారికి కృతజ్ఞతలు అంటూ ఈ పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఆమెకు సీతారామ లక్ష్మణుల ఆంజనేయస్వామి చిత్రపటాన్ని కూడా అందజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…