Oye Movie: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఇప్పటికే ఎంతోమంది హీరోల సినిమాలు తిరిగే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే త్వరలోనే నటుడు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన ఓయ్ సినిమా కూడా తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
ఆనంద్ రంగా దర్శకత్వంలో 2009వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే తిరిగి మరోసారి ఈ సినిమాని వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు. ఇక ఇదే విషయాన్ని డైరెక్టర్ ఆనంద్ రంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
ఇలా డైరెక్టర్ ఈ సినిమా రీ రిలీజ్ పోస్టర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక నేటి ఏకంగా డైరెక్టర్ ను తిట్టిపడేశారు.. ఒరేయ్ గుండు నాయాల ఇంత మంచి సినిమాని తీసి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ నేటిజన్ చేసినటువంటి ఈ కామెంట్ పై డైరెక్టర్ స్పందించారు.
సారీ చెప్పిన నెటిజన్..
ఇక దానికి దర్శకుడు.. స్మైల్ ఎమోజితో రిప్లై ఇచ్చారు. దానికి ఆ నెటిజెన్ రియాక్ట్ అవుతూ..సారీ సార్ అలా పిలిచినందుకు అని కామెంట్ చేయగా, దర్శకుడు దానిని స్పోర్టివ్ గా తీసుకోని..ఏం పర్వాలేదు. కానీ నువ్వు అన్నది నిజమే అంటూ రిప్లై ఇవ్వడమే కాకుండా నేటిజన్ చేసినటువంటి కామెంట్ చాలా పాజిటివ్ గా తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…