Niharika: మెగా కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే కానీ హీరోయిన్గా మాత్రం ఇప్పటివరకు ఎవరు రాలేదు అయితే నాగబాబు కుమార్తె నిహారిక మాత్రం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కెరియర్ మొదట్లో యాంకర్ గా కొనసాగిన ఈమె అనంతరం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఒక మనసు సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి నిహారిక హ్యాపీ వెడ్డింగ్ సూర్యకాంతం వంటి మూడు సినిమాలలో నటించారు.
ఈ మూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడంతో చేసేదేమీ లేక కుటుంబ సభ్యులు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు అయితే వీరి పెళ్లి జీవితం కూడా ఎక్కువ కాలం పాటు సాగలేదని చెప్పాలి. రెండేళ్ల తర్వాత విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక ప్రస్తుతం సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఈమె కేవలం నిర్మాతగా మాత్రమే కాకుండా హీరోయిన్గా కూడా తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. మొదటిసారి హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయినటువంటి ఈమె సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి సక్సెస్ అందుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు.
మలయాళీ సినిమాలో నిహారిక..
ఇప్పటికే మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న వాట్ ది ఫిష్ అనే సినిమాలో ఈమె నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఒక మలయాళీ సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మద్రాస్ కారన్ టైటిల్ తో ఈ మలయాళ చిత్రం తెరకెక్కుతుంది. షేన్ నిగమ్ హీరోగా నటిస్తున్నాడు.మద్రాస్ కారన్ చిత్రానికి వాలి మోహన్ దాస్ దర్శకుడు. నిహారికకు ప్రాజెక్ట్ లోకి వెల్కమ్ చెబుతూ పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…