Pushpa 2: పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి సన్నిహితంగా ఉన్నటువంటి కేశవ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేశవ పాత్రలో చిత్తూరు జిల్లాకు చెందినటువంటి జగదీష్ అనే వ్యక్తి ఎంతో అద్భుతంగా నటించారు. ఇక ఈ సినిమాతో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి జగదీష్ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
తాను ప్రేమించిన అమ్మాయి తనకు తెలియకుండా మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడంతో వారి ఫోటోలను తీసిన జగదీష్ ఆ ఫోటోలను చూపించి ఆ యువతని బెదిరించారు. తనకు దూరంగా ఉండకపోతే ఈ ఫోటోలను ఇంటర్నెట్లో పెడతాను అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇక నిజంగానే అనంతపని చేస్తారన్న ఆ యువతి మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుని మరణించారు.
ఇలా ఆ యువతి మరణించడంతో తన ఆత్మహత్యకు జగదీష్ కారణమని పోలీసులు తనని అరెస్టు చేశారు కానీ పుష్ప టు సినిమాలో అల్లు అర్జున్ జగదీష్ మధ్య వచ్చే సన్నివేశాలు కీలకంగా ఉన్నాయి. దీంతో ఈయన జైలు పాలు కావడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతుందని అందరూ భావించారు కానీ తనను బెయిల్ మీద బయటకు తీసుకురావడం కోసం పుష్పం మేకర్స్ ఎన్నో ఇబ్బందులు పడ్డారని వారి వల్లే ఈయన బయటకు వచ్చారని తెలుస్తుంది.
పుష్ప 2 షూటింగ్లో కేశవ..
ఇలా ఈ విషయం గురించి ఎక్కడా అధికారక ప్రకటన లేకపోయినా ఈయన జైలు నుంచి సరాసరి పుష్ప షూటింగ్ లోకేషన్ కి వెళ్ళారని ముందుగా అల్లు అర్జున్ కేశవ మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరించడానికి దర్శకుడు కూడా సిద్ధమయ్యారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాదులో ఒక భారీ సెట్ వేసి గంగమ్మ జాతరకు సంబంధించిన షూటింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ సినిమా యధావిధిగా ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతుందని చిత్ర బృందం ఇటీవల క్లారిటీ ఇచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…