Poonam Kaur: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు కంటే సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు చేస్తూ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నటువంటి వారిలో పూనమ్ కౌర్ ఒకరు. ఈమె తరచూ ఇండస్ట్రీకి సంబంధించిన వారి పట్ల పరోక్షంగా పోస్టులు చేస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా తన సమస్య గురించి చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. ఈమె గత మూడు సంవత్సరాలుగా భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. ఈ వ్యాధి కారణంగా తనకు కనీసం బట్టలు వేసుకోవడానికి కూడా ఇబ్బందిగా మారిందని తెలిపారు. మూడు సంవత్సరాలుగా తాను ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధితో బాధపడుతున్నానని తెలిపారు.
ఫైబ్రోమయాల్జియా వ్యాధి శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి ముఖ్యంగా ఎమోషనల్ గా ఫీల్ కావడం వల్ల వస్తుంది అని అంటున్నారు. కారు ప్రమాదం లాంటి యాక్సిడెంట్స్ వల్ల కూడా ఈ వ్యాధి మొదలవుతుంది. దీని లక్షణాలు దారుణంగా ఉంటాయి. శరీరం మొత్తం నొప్పులు ఉండడమే కాకుండా ఉదయం నిద్ర లేవగానే శరీరం మొత్తం బిగిసిపోయినట్టు అనిపిస్తుందని ఈమెకు తాను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి తెలిపారు.
ఫైబ్రోమయాల్జియా వ్యాధి…
ఇలా తాను భయంకరమైనటువంటి వ్యాధి బారిన పడటంతో గతంలో కేరళలో కూడా ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకున్నానని తెలిపారు. తాజాగా ఆయుర్వేద నిపుణులు అయినటువంటి మంతెన సత్యనారాయణ గారిని కలిసి ఈమె తన సమస్యకు తనని సలహాలు సూచనలు కూడా అడిగి తెలుసుకున్నారని అలాంటి ఒక గొప్ప వ్యక్తిని కలవడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఆయనతో కలిసి దిగినటువంటి ఫోటోని షేర్ చేస్తూ వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…