Upasana: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలతో పాటు అలాగే కొత్తగా ప్రారంభించిన అత్తమ్మ కిచెన్స్ కి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అయితే ఉపాసన రాంచరణ్ వివాహమైన తర్వాత 11 సంవత్సరాలకు తల్లిదండ్రులుగా మారిన సంగతి తెలిసిందే.
ఇలా 11 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ తల్లిదండ్రులుగా మారారు. ఇకపోతే ఉపాసన తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలతో పాటు తన కూతురికి సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఉపాసన డెలివరీ తర్వాత తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలిపారు.
అందరిలాగే డెలివరీ తర్వాత నేను కూడా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని తెలిపారు. ఆ సమయంలో నా భర్తనే నా థెరపిస్ట్ అని ఈమె తెలిపారు. నేను డిప్రెషన్ లోకి వెళ్తే ఆయన తనకు తోడుగా ఉంటూ తనని ఆ సమస్య నుంచి బయటకు తీసుకువచ్చారు తనతో పాటు చరణ్ కూడా నా పుట్టింటికి వచ్చారని ఉపాసన తెలిపారు అయితే ఈ అదృష్టం అందరి మహిళలకు ఉండదని ఈమె తెలిపారు.
నేనే ఎక్కువగా ఏడుస్తాను..
అయితే ప్రతి ఒక్క భర్త కూడా వారి భార్యలకు ఇలాంటి సపోర్ట్ ఇవ్వడం చాలా అవసరమని తెలియజేశారు. ఇక తన కుమార్తె గురించి మాట్లాడుతూ తన కూతురిని వదిలి ఎక్కడికైనా వెళ్లాలి అంటే నా వల్ల కాదని తప్పనిసరి పరిస్థితులలో వెళ్ళినప్పుడు తన కూతురి కంటే నేనే ఎక్కువగా ఏడుస్తాను అంటూ ఈ సందర్భంగా ఉపాసన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…