Upasana: ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె మెగా ఇంటి కోడలుగా మాత్రమే కాకుండా ఒక బిజినెస్ ఉమెన్ గా కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఎంతో అద్భుతమైనటువంటి ఆలోచన విధానం ఇతరులకు సహాయం చేసే గుణం ఉపాసనకి ఉందని చెప్పాలి. ఈ విషయాలలో ఈమె ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
ఇలా ఉపాసన తన వ్యక్తిగత జీవితంలోను వృత్తిపరమైన జీవితంలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఉపాసన రాంచరణ్ వివాహం జరిగిన తర్వాత 11 సంవత్సరాలకు తల్లిదండ్రులుగా మారిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ జంటకు ప్రస్తుతం కుమార్తె జన్మించారు. అయితే తాజాగా ఈమె మరో శుభవార్తను అభిమానులకు తెలిపారు. తాను సెకండ్ బేబీని కనటానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఉపాసన తెలిపారు.
ఉపాసన ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు ఆరోగ్యంపై పూర్తి దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చింది. మన జీవితంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది మహిళల నిర్ణయం పైన ఆధారపడి ఉంటుందని తెలిపారు. తాను ఇంత ఆలస్యంగా పిల్లల్ని ప్లాన్ చేయడానికి కారణం లేకపోలేదని ఉపాసన తెలిపారు.
వారసుడు రాబోతున్నారా..
తనతో పాటు తన డాక్టర్ కూడా పిల్లలను ఆలస్యంగా ప్లాన్ చేశారని ఈమె తెలియజేశారు అయితే తాను సెకండ్ బేబీని ప్లాన్ చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నానని ఉపాసన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ విధంగా ఉపాసన సెకండ్ బేబీని ప్లాన్ చేయడానికి కూడా సిద్ధమే అని చెప్పడంతో తప్పకుండా ఈసారి మెగా వారసుడు రాబోతారంటూ అభిమానులు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…