Uppal Balu : టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయి బుల్లితెర మీద కూడా కనిపించి ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ తో గుర్తింపు తెచ్చుకున్న ఉప్పల్ బాలు తాను ఎదుర్కొన్న ఇబ్బందులను, ఆర్థిక కష్టాలను, సమాజం తనని చూస్తున్న తీరు లాంటి విషయాలను అలాగే తాను కెరీర్ పరంగా ఇంకా ఏం సాధించాలని అనుకుంటున్నది యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.
తిండి లేని రోజులు చూసా… ఆపరేషన్ చేయించుకుంటే…
ఉప్పల్ బాలు చిన్న గ్రామంలో జన్మించినా తండ్రి మరణించడంతో తల్లి కూలీ పనులకు వెళ్ళి పోషించింది. ఇక ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఇంటర్ మొదటి సంవత్సరంలోనే మానేసి ఉప్పల్ కి వెళ్లి అక్కడ ఆఫీస్ బాయ్ గా మొదట ఉద్యోగం చేసేవాడట. చిన్న తనంలో ఇంట్లో సరిపడా తిండి లేకపోవడంతో ఆకలి తో ఉన్నవుడు చిన్న పిల్లల దగ్గగర రొట్టెలు లాక్కుని తిన్న రోజులు ఉన్నాయి అంటూ చెప్పాడు ఉప్పు బాలు. ఇక తాను అందరిలా కాకుండా తేడాగా ఉన్నాను అనే విషయం ఎపుడూ అనిపించలేదంటూ చెప్పిన బాలు చాలా మందిలా నేను ఆపరేషన్ చేయించుకుంటా అని అందరూ కామెంట్స్ చేసేవాళ్ళు, నేను అమ్మయిగా మారాలనుకుంటే నేను మారిపోతాను.
ఎవరో ఏదో అనుకుంటారు అనే భయం, ఆలోచన లేవు కానీ నేను మారాలని అనుకోలేదు, చిన్నపటి నుండి ఎలా ఉన్నానో అలానే ఉంటాను అంటూ తెలిపారు. ఇక ఉప్పల్ వచ్చిన మొదట్లో ఆఫీస్ బాయ్ గా పనిచేస్తూనే డబ్బులు సరిపోక బాడీ మసాజ్ చేస్తూ ఒకవైపు పెళ్లి కూతుర్లకు మెహందీ పెడుతూ డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించుకున్నాను అంటూ చెప్పాడు ఉప్పల్ బాలు. ఇక తాను ఇంత ఫేమస్ అవుతానని అనుకోలేదంటూ చెప్పిన బాలు ఇప్పటికైనా ఒక పెద్ద హీరో పక్కన నటించాలని ఒక చిన్న పాత్రయినా చేయాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…