Usha Mulpuri : తెలుగు యువ నటుడుగా నచ్చిన కథలతో సినిమాలను చేస్తూ నటుడుగా ప్రూవ్ చేసుకుంటున్న హీరో నాగ శౌర్య. క్రికెట్ గర్ల్స్ అండ్ బాయ్స్, చందమామ కథలు సినిమాలతో తెలుగు తెరకు పరిచయమైన నాగ శౌర్య ఆ తరువాత ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మి రావే మా ఇంటికి, కళ్యాణ వైభోగమే, ఒక మనసు, ఛలో తాజాగా లక్ష్య ఇలా వరుస సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన ‘కృష్ణ వృంద విహారి’ సినిమా పర్వాలేదని అనిపించింది. అయితే లేటెస్ట్ గా నాగశౌర్య అనూష శెట్టి అనే బెంగళూరు కు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నారు. ఇక తన పెళ్లి గురించి శౌర్య అమ్మ ఉష గారు యూట్యూబ్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు మరోసారి వైరల్ అయ్యాయి.
పెళ్ళయ్యాక నీతో ఉండను అని ఎపుడో చెప్పేసాడు…
ఇటీవలే ఘనంగా పెళ్లి చేసుకున్న నాగశౌర్య పెళ్లి గురించి ఆయన ఆలోచనల గురించి తల్లి ఉష మాట్లాడుతూ శౌర్య రెండో క్లాసో మూడో క్లాసో చదివే సమయంలోనే పెళ్లి చేసుకున్నాక నీతో ఉండను వేరే ఉంటాను అని చెప్పాడట. ఎందుకలాగా అని అడిగితే ఇద్దరు మంచోళ్ళు ఒకచోట ఉండకూడదు సమస్యలు వస్తే కష్టం ఇద్దరు మంచోళ్లతో అందుకే అని చెప్పాడట.
అలా ఇపుడు పెళ్లి అయిన కొడుకు కోడలు సెపరేట్ గా ఉంటారు మాతో కలిసి ఉండరు అంటూ ఉష గారు చెప్పారు. ఇక శౌర్య తల్లిదండ్రులది ప్రేమ వివాహం కావడం వల్ల పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకుంటే మాకు అభ్యంతరం లేదంటూ ఉష గారు చెప్పారు. పెద్ద కొడుకుది కూడా లవ్ మ్యారేజ్ అంటూ చెప్పి నాగా శౌర్య కూడా ఇష్టపడి ఒకరిని చేసుకుంటానంటే వారితోనే పెళ్లి అంటూ ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు శౌర్య మదర్ ఉష గారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…