Vagdevi : ఆహా ఒరిజినల్స్ లో ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ షో కి బాగా క్రేజ్ ఉంది. సింగర్ కార్తీక్, నిత్యా మీనన్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ జడ్జెస్ గా ఉన్న ఈ షోలో ఇండియన్ ఐడల్ విజేత శ్రీరామ చంద్ర హోస్ట్ గా వ్యవహారిస్తున్నారు. ఇక ఈషో రీసెంట్ గా తుది దశకు చేరుకొని టాప్ కంటెస్టెంట్స్ లో ఎవరు విజేతగా నిలుస్తారో అని ఉత్కంఠగా ఎదురుచూశారు. ఇక ఫైనల్స్ కి చిరంజీవి ముఖ్య అతిధి గా సాయి పల్లవి, రానా అతిధులుగా వచ్చారు. ఇక ఫైనల్ గా వాగ్దేవి విజేతగా నిలిచింది.
చిరు సినిమాలో పాడే అవకాశం…..
ఇక వాగ్దేవి ఫైనల్స్ లో విజేత అయ్యాక, మెగాస్టార్ చిరంజీవి గారు తన నెక్స్ట్ సినిమాలో పాట పాడే అవకాశం ఇచ్చారు. ఇక సింగర్ కార్తీక్ కూడా తన నెక్స్ట్ మ్యూజిక్ ప్రాజెక్ట్ లో సింగర్ గా అవకాశం ఇస్తామని చెప్పారు. ఇక గీత ఆర్ట్స్ లో నెక్స్ట్ సినిమాలో పాడే అవకాశం అందుకుంది. తాజాగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న వాగ్దేవి తన నేపథ్యం, తన అభిరుచుల గురించి మాట్లాడింది. నెల్లూరుకి చెందిన వాగ్దేవి తండ్రి ఎల్ ఐ సి లో పనిచేస్తారని తన తల్లికి సంగీతమంటే చాలా ఇష్టం ఉండటంతో సంగీతం క్లాసులకు పంపేదని మా అక్క నేను క్లాసులకు వెళ్లి సంగీతం నేర్చుకున్నామని, ఆ తరువాత త్యాగరాజ భవనంలో సంగీత కచేరిలు తన అక్కతో పాటు చేయడం వల్ల వైవ సిస్టర్స్ అని పేరు వచ్చింది అని తన అక్క పేరు వైష్ణవి, తన పేరు వాగ్దేవి కావడంతో అలా వైవ సిస్టర్స్ అని పేరొచ్చిందని తెలిపింది.
ఇక ఆర్చిటెక్ట్ చదువుతున్న తాను నెక్స్ట్ ఇండియన్ ఐడల్ కి పోటీకి వెళ్తారా అని అడుగగా ఆసక్తి లేదని చెప్పింది. ఇక చిత్ర గారంటే చాలా ఇష్టమని హీరోలలో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని, ఇక హీరోయిన్ కీర్తీ సురేష్ ఇష్టమని చెప్పింది. ఇక జడ్జెస్ గా వ్యవహరించిన థమన్, కార్తీక్, నిత్యా మీనన్ గురించి చెబుతూ థమన్ చాలా డిటైల్డ్ గా మా తప్పులను చెబుతారని అది నెక్స్ట్ పాటకు బాగా ఉపయోగపడుతుందని చెప్పింది. ఇక నిత్యా మీనన్ ఎలా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలో బాగా చెబుతారని, ఇక కార్తీక్ అవసరమైతే తప్ప గట్టిగా ఏమి చెప్పరని, ఎపుడు చక్కగా గైడ్ చేస్తారని చెప్పింది. ఇక హోస్ట్ శ్రీ రామ్ కూడా మంచి సలహాలు ఇస్తారని చెప్పింది.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…