Vakkantham Vamsi : తెలుగు సినీ అభిమానులకు రచయితగా, దర్శకుడిగా వక్కంతం వంశీ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఈటీవీ లో మొదట వ్యాఖ్యతగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన వంశీ 1996లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన కల్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో హీరోగా నటించాడు. తరువాత కొన్ని సీరియల్స్ లో కూడా నటించాడు. ఇక ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అశోక్ సినిమాతో మొదటిసారి రచయితగా చేసాడు. తరువాత వచ్చిన కిక్ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాకు కథను అందించడమే కాకుండా దర్శకత్వం వహించారు. తన సినిమాల గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఆయన పంచుకున్నారు.
ఆ రెండు తప్పుల వల్లే సినిమా ఫ్లాప్…
తను చేసన సినిమాల గురించి తన దర్శకులు, హీరోల గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చిన వక్కంతం వంశీ గారు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్ 2’ సినిమా గురించి చాలా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. కిక్ సినిమా ఎంతటి విజయం సాధించిందో మనకు తెలిసిందే, దాని సీక్వెల్ గా చాలా అంచనాల మధ్య వచ్చిన కిక్ 2 ఆశించినట్టుగా అలరించలేకపోయింది. సరిగా ఆడకపోవడానికి ఆ సినిమాను కిక్ సినిమాకి సీక్వెల్ అని చెప్పడం ప్రధాన కారణం అని వంశీ చెప్పుకొచ్చారు. రెండు కథలు వేరు వేరు అని, ఒక కథ అనుకోని దాన్ని అందరం సీక్వెల్ గా చూపించామని చెప్పారు. ఇక ఊరి జనాల ఎమోషన్ సరిగా చూపించకపోవడం రెండవ కారణం అని చెప్పుకొచ్చారు.
సురేందర్ రెడ్డితో చాలా సినిమాలు చేశానని, అందులో ‘ఏజెంట్’ సినిమా ఫ్లాప్ అవ్వడం చాలా బాధ వేసిందని చెప్పుకొచ్చారు. ఆ సినిమా కోసం అందరూ చాలా కష్టపడ్డారు కానీ అలా అవ్వడం చాలా బాధ వేసింది అని చెప్పుకొచ్చారు. ఇక సురేందర్ రెడ్డి గురించి చెబుతూ మొదట్లో ఇద్దరికీ కుదిరేది కాదు బాగా గొడవ అయ్యేది, తాను చాలా మొండిగా ఉండేవాడు అది చూసి నేను అలానే ఉండేవాన్ని. తరువాత చిన్నగా ఇద్దరికీ మంచి అవగాహన కుదిరింది. తనతో సినిమా చేసేటప్పుడు చాలా కంఫర్ట్ ఉంటుంది. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినా దానికి కారణం ఇద్దరం సమానంగా తీసుకుంటాం అని ఇద్దరి గురించి చెప్పారు.
తీపి పదార్థాలు తిన్న వెంటనే మనకు ఉత్సాహం పెరిగినట్లు అనిపించడం సహజం. చాక్లెట్, స్వీట్లు తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే శరీరంలో…
ప్రకృతిలో లభించే పండ్లలో కొన్నివి చూసేందుకు విచిత్రంగా కనిపించినా, వాటి లోపల దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి.…
ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సాధారణంగా నొప్పి, జ్వరం వంటి సంకేతాలు కనిపిస్తాయని అనుకుంటాం. అయితే కొన్ని వ్యాధులు ఎలాంటి స్పష్టమైన…
వేసవి కాలంలో లభించే అరుదైన పండ్లలో పాల పండు ఒకటి. చాలా మందికి ఈ పండు గురించి పెద్దగా తెలియకపోయినా,…
ప్రతి ఇంటి వంటగదిలో సులభంగా దొరికే బేకింగ్ సోడా, వంటల్లో మాత్రమే కాదు, రోజువారీ పనుల్లో కూడా ఎంతో ఉపయోగకరంగా…
నవజాత శిశువుల సంరక్షణలో మసాజ్ ఒక ముఖ్యమైన భాగంగా భావించబడుతోంది. భారతీయ కుటుంబాల్లో ఇది తరతరాలుగా కొనసాగుతున్న అలవాటు అయినప్పటికీ,…