Vande Bharath Express : కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో గిఫ్ట్ ఇచ్చింది. దేశంలో ఫాస్ట్ ట్రైన్ అయిన వందే భారత్ ను ప్రారంభించింది. సికింద్రాబాద్ నుండి వైజాగ్ వరకు వెళ్లే ఈ ట్రైన్ ను ప్రధాన మంత్రి మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సంవత్సరం జనవరి 16 న ప్రారంభించారు. ఇక ఇపుడు మరో ట్రైన్ అందుబాటులోకి వచ్చింది. అదే సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ విశేషాలు, టికెట్ ధరల గురించి తెలుసుకుందాం.
తగ్గిన ప్రయాణం సమయం… సామాన్యులకు ఊరట…
ప్రధాని మోడీ ఏప్రిల్ 8వ తేదీన వందే భారత్ ట్రైన్ ను సికింద్రాబాద్ లో ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్లాలంటే కేవలం 8 ఎనిమిదిన్నర గంటల సమయంలోనే చేరుకోవచ్చు. ఇది ప్రయాణికులకు ఎంతో ఊరటనిచ్చే విషయం. మొదట్లో ఆరున్నర గంటలలో చేరుకుంటుందని ప్రచారం జరిగినా అది నిజం కాదు గంటకు 77.73 కిలోమీటర్ల సగటు వేగంతో ఈ సికింద్రాబాద్ టూ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణించనుంది. ఏప్రిల్ 8న మాత్రం సికింద్రాబాద్ నుంచి ఉదయం 11:30 గంటలకు రైలు ప్రారంభమవుతుంది.
తొలి రోజున నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్‌లో ఆగుతుంది. సికింద్రాబాద్ నుంచి వెళ్లేటప్పుడు నల్గొండకి ఉదయం 07:20, గుంటూరుకి 09.50, ఒంగోలుకి 11.10, నెల్లూరుకి 12.30కి చేరుకుంటుంది. తిరుపతి నుంచి వచ్చేటప్పుడు, నెల్లూరుకి సాయంత్రం 05:20కి, ఒంగోలుకి 06:30కి, గుంటూరుకి రాత్రి 07:45, నల్గొండకి రాత్రి 10:10కి చేరుకుంటుంది. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్‌లో మొత్తం 8 కోచ్‌లు ఉంటాయి. ఇందులో నాలుగు చైర్ కార్, మరో నాలుగు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్‌లు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…