Analyst Damu Balaji : కమెడియన్ వేణు గారు డైరెక్టర్ గా మారి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని తీశారు. కమెడియన్ కాబట్టి కామెడీ సినిమా తీస్తారని అందరూ అనుకున్నా అందుకు భిన్నంగా ఒక ఎమోషనల్ డ్రామాను చావుతో ముడిపడిన బంధాలను చూపించి ఆకట్టుకున్నాడు. చిన్న సినిమాగా వచ్చిన ‘బలగం’ సినిమా నేడు థియేటర్స్ లో డీసెంట్ కలెక్షన్స్ అందుకుంటోంది. అందులో నటించిన ఆర్టిస్టులందరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఒక చిన్న చినుకులాగా మొదలై జడివాన లాగా మారినట్లు బలగం సినిమా కూడా చిన్నసినిమాగా మొదలై ప్రజల అభిమానంతో పాటు ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంటోంది.
అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న బలగం…
అనలిస్ట్ దాము బాలాజీ గారు బలగం సినిమా గురించి మాట్లాడుతూ పూర్తిగా ఒక తెలంగాణ సంప్రదాయాన్ని ప్రొజెక్ట్ చేసే సినిమా, నేడు అంతర్జాతీయ వేదిక మీద ప్రశంసలు అందుకోవడం హర్షనీయం అంటూ తెలిపారు. ఇప్పటికీ లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో డైరెక్టర్ వేణు కి అలాగే సినిమాటోగ్రాఫర్ వేణు ఆచార్య కు అవార్డులు వచ్చాయి. ఇలా అంతర్జాతీయంగా రెండు అవార్డులను అందుకున్న ఈ సినిమా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ట్రోల్ కూడా నడుస్తోందని తెలిపారు. ఈ సినిమాలో పూనకాలు వచ్చే సన్నివేశాలు ఉంటాయి.
అలాంటి మూఢనమ్మకాలను ప్రోత్సాహించే సినిమాలకు ఎలా అవార్డులు ఇస్తారంటూ కొంతమంది మాట్లాడటం బాగోలేదు. సినిమలో కొత్త డ్రామా నడిస్తేనే ప్రేక్షకులు దానికి కనెక్ట్ అవుతారు. అయినా అలాంటి మూఢనమ్మకాలు ఉన్న సినిమా కూడా అంతర్జాతీయ వేదిక మీద అవార్డు అందుకున్నపుడు ఇలాంటి ట్రోల్స్ తగవు అంటూ చెప్పారు దాము బాలాజీ. ఈ సినిమాలో సహజమైన సంభాషణ, ఎటువంటి కృత్రిమత్వానికి చోటు లేకుండా క్వాలిటీ సినిమాటోగ్రఫీ వల్ల సినిమా మరింత జనాలకు చేరువైంది. అందులోనూ అక్కడే లోకల్ గా ఉన్న వారితో నటింపజేయడం వల్ల సినిమాకు ఫ్రెష్ నెస్ వచ్చింది అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…