Vijayashanti: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలకు పోటీగా సినిమాలలో నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ఎంతో అద్భుతంగా నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినటువంటి విజయశాంతి పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి విజయశాంతి తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఈమె నటించిన విషయం మనకు తెలిసిందే.
ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించిన విజయశాంతి ఇన్ని రోజులపాటు తనకు పిల్లలు ఉన్నారు అనే విషయాన్ని దాచి పెట్టారని తెలుస్తోంది.గత కొంతకాలంగా ఈమెకు పాతిక సంవత్సరాల కొడుకు ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై స్పందించడం విజయశాంతి ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
ఈ వార్తలపై స్పందించిన విజయ్ శాంతి స్పందిస్తూ తాను
M.V. శ్రీనివాస్‌ను వివాహం చేసుకున్నానని తెలిపారు. అయితే తనకు పిల్లలు లేరనే విషయం దాదాపు అందరికీ తెలిసిందే. ఇలా లేని వారిని ఉన్నారని చూపించడం చాలా మూర్ఖత్వం ఇది తెలివిలేని వారు చేసే పని అని తెలిపారు.ఇక ప్రజా సేవ చేయడం కోసం తనకు పిల్లలు ఉంటే అడ్డుగా ఉంటుందని భావించిన తాను పిల్లలను వద్దనుకున్నానని ఈ సందర్భంగా విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను రాజకీయాలతో ఎన్నో బిజీగా ఉన్నానని ఇక మంచి కథ ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తే సినిమాలలో నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని విజయశాంతి క్లారిటీ ఇచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…