Featured

Vangalapudi Anitha : మీ భర్తను కొట్టించి… చిత్ర హింసలు పెట్టించారా… భర్త పిల్లలు గురించి చెప్పిన వంగలపూడి అనిత…!

Vangalapudi Anitha : టీడీపీ మహిళా నేతగా 2014 లో తొలిసారి ఎమ్మెల్యే గా పాయకరావుపేట నియోజకవర్గం నుండి గెలిచిన వంగలపూడి అనిత తొలుత టీటీడీ సభ్యురాలిగా పనిచేసారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ మహిళా నేత తానేటి వనిత చేతుల్లో ఓడిపోయిన అనిత ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. మీడియా సమావేశాల్లోను, డిబేట్స్ లో పాల్గొంటూ వైసీపీ మీద విరుచుకుపడే అనిత ఫైర్ బ్రాండు గా పేరు తెచ్చుకున్నారు. ఎపుడూ రాజకీయాలు విమర్శలు, ప్రతి విమర్శలు అంటూ బిజీగా ఉండే అనితగారు తొలిసారి ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి చెప్పారు.

భర్తను కొట్టించారా…

తన మీద వైసీపీ సోషల్ మీడియా ద్వారా వంగలపూడి అనిత తన భర్తను కొట్టించి జైలుకి పంపిందని అలాగే బాగా చిత్రహింసలు పెట్టిందనే వార్తలు వ్యాపింపజేశారు అంటూ అనిత తెలిపారు. అలాంటి పుకార్లను పుట్టించిన వారు నా ముందుకు వస్తే సమాదానం చెప్పాలని చాలా రోజులుగా అనుకుంటున్నట్లు ఇంటర్వ్యూలో తెలిపారు. అలా పుకార్లు పుట్టించిన వారికీ కుటుంబం ఉంటుంది, నేను వారి కుటుంబం గురించి మాట్లాడితే వారికి అపుడు అర్థమవుతుంది.

చాలాసార్లు నేను ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడకూడదు అనే ఉద్దేశం తోనే నన్ను ఎంత కించపరిచేలా విమర్శలను చేసినా హద్దులో ఉండి విమర్శిస్తున్నాను కానీ దాన్ని వాళ్ళు చేతకానితనం అనుకుంటున్నారు అంటూ వివరించారు. కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు అందరికీ ఉంటాయి అలాంటివే నాకు నా భర్త శివ ప్రసాద్ కీ ఉన్నాయి. అన్నీ సర్దుకుని మేము బాగున్నానము అంటూ చెప్పారు. ఇక పిల్లల విషయానికి వస్తే ఒక బాబు ఒక పాప ఉండగా బాబు డిగ్రీ చేస్తుండగా పాప పదో తరగతి చదువుతోందని తెలిపారు. వాళ్ళు నన్ను బాగా అర్థం చేసుకుంటారని, వాళ్ళ కోసమే ఏదైనా చేసినా వాళ్లకు నచ్చక పోతే అసలు అది చేయను అంటూ చెప్పారు అనిత.

Bhargavi

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

1 day ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

1 day ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

1 day ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

1 day ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

1 day ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

1 day ago